Shiva Jyothi: శివజ్యోతికి సిగ్గుందా.. ఇలాంటి పనులు చేయాలా?

Shiva Jyothi: బుల్లితెర యాంకర్ శివ జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె గురించి ఇప్పుడు ట్రోల్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. ఆమె ఏదైనా పోస్ట్ చేస్తే చాలు ట్రోలర్స్ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆమె ఎలా ఉండేదో అందరికీ తెలుసు. కెరీర్ మొదట్లో ఎంతో పద్ధతిగా శివ జ్యోతి కనిపించి అందరి దగ్గర మంచి పేరును పొందింది. ఇప్పుడు బాగా గ్లామర్ షో పెంచటంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

 

తాజాగా మరోసారి శివ జ్యోతి ట్రోల్స్ ఎదుర్కొంది. కెరీర్ మొదట్లో ఈ యాంకర్ వి6 ఛానల్ లో తీన్మార్ వార్తల్లో యాంకర్ సావిత్రిగా అందరికీ కనిపించింది. ఆ షోలో తన మాటలతో అందరినీ తన వైపుకు తిప్పుకుందని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలతో తన పరిచయాన్ని పెంచుకున్న శివజ్యోతి ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. బిగ్ బాస్ లో తన ఆట తీరుతో అందర్నీ శివ జ్యోతి ఆకట్టుకుంది. కానీ మధ్యలోనే ఇంటి బాట పట్టి షాక్ ఇచ్చింది.

 

ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక మరో ఛానల్ లో యాంకర్ గా శివ జ్యోతి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా బుల్లితెరపై వచ్చే షోస్, ఈవెంట్స్ లలో పాల్గొంటూ సందడి చేసింది. ఇక బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు మరిన్ని విషయాలను పంచుకుంటూ ఉంది. అయితే ఈ మధ్య శివ జ్యోతిని చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు శివ జ్యోతి చాలా పద్ధతిగా ఉండేదని, ఇప్పుడు ఆమె అలా లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య ఆమె పొట్టి పొట్టి బట్టలు వేసి అందర్ని షాక్ అయ్యేలా చేస్తోందని, ఇక తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను, ఫన్నీ వీడియోలు బాగా షేర్ చేస్తూ వస్తోందని, అందులో ఆమె గ్లామర్ తో రెచ్చిపోతోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

 

తాజాగా శివ జ్యోతి ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. అందులో పట్టు చీర కట్టుకొని అందంగా రెడీ అయి బాత్రూం క్లీన్ చేసే హార్పిక్ గురించి అడ్వర్టైజ్ ఇవ్వడంతో దానిని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. అందంగా రెడీ అయ్యి హార్పిక్ అడ్వర్టైజ్ చేస్తావా అంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక మరి కొంతమంది దీనికి కూడా మేకప్ వేసుకోవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -