Review: హిట్2 మూవీ రివ్యూ

Review: విడుదల తేదీ : డిసెంబర్ 2, 2022

నటీనటులు: అడివి శేష్, మీనాక్షి చౌదరి, తనికెళ్ల భరణి, సుహాస్

నిర్మాణ సంస్థ : వాల్ పోస్టర్ సినిమా

నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని

దర్శకత్వం : శైలేష్ కొలను

సంగీతం : ఎం.ఎం.శ్రీలేఖ సురేష్ బొబ్బలి

ఎడిటర్ : గ్యారీ

సినిమాటోగ్రాఫర్ : ఎస్. మణికందన్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న అడివి శేష్ హిట్ సీక్వెల్ హిట్2 లో నటిస్తున్నారనే ప్రకటన రాగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. నాని ఈ సినిమాకు నిర్మాత కావడంతో ఈ సినిమా కోసం నాని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు. మేజర్ తర్వాత అడివి శేష్ నటించిన ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం గమనార్హం. ఈ వారం రిలీజైన సినిమాలలో ఈ సినిమకే ఎక్కువ థియేటర్లు దక్కాయి.

కథ :
ఎస్పీ స్థాయిలో పని చేసే కృష్ణదేవ్(అడివి శేష్) చూడటానికి కూల్ గా ఉన్నా కేసులను మాత్రం తన తెలివితేటలతో సులువుగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో నేరస్థుల బుర్రలు కోడి బుర్రలని శేష్ కామెంట్ చేస్తాడు. అయితే ఆ తర్వాత విశాఖలోని పబ్ లో ఒక అమ్మాయి దారుణ హత్యకు గురవుతుంది. ఆ అమ్మాయి శరీరంలో వేర్వేరు అమ్మాయిల అవయవాలు ఉండటంతో ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో కృష్ణదేవ్ కు అర్థం కాదు.

కృష్ణదేవ్ అలియాస్ కేడీ సమస్య పరిష్కారం కోసం అడుగులు వేస్తున్న సమయంలో అతనికి మరిన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆ హంతకుడు ఎవరు? అమ్మాయిలను టార్గెట్ చేసి ఆ హంతకుడు హత్యలు చేయడానికి కారణమేంటి? ఈ ప్రయత్నంలో అడివి శేష్ సక్సెస్ అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

విశ్లేషణ :

క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే ప్రేక్షకులు మూవీలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఏదైనా ప్రత్యేకతలు ఉంటే ఆ సినిమాలను ఇష్టపడతారు. హిట్2 కూడా ఆ కోవకు చెందుతుంది. సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది. ట్విస్ట్ గురించి ఈ సినిమా మేకర్స్ చేసిన కామెంట్లు ఈ సినిమాకు ఒకింత మైనస్ అని చెప్పవచ్చు. విలన్ ఎవరో తెలిసి ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురవుతారు.

మరోవైపు హిట్ సిరీస్ హిట్3 లో నాని హీరోగా కనిపించనుండగా నానికి ఇలాంటి కథలు సూట్ అవుతాయా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. శేష్ ఈ సినిమాలోని తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. మీనాక్షి చౌదరి పాత్ర పరిమితమే అయినా తన నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :

నాని ఈ సినిమా కోసం ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బీజీఎం, మ్యూజిక్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు నూటికి నూరు శాతం ఔట్ పుట్ ఇవ్వడానికి తమ వంతు కష్టపడ్డారు. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

 

ప్లస్ పాయింట్లు :

అడివి శేష్ నటన

ఎడిటింగ్

సినిమాలోని ట్విస్టులు

మైనస్ పాయింట్లు :

వృథా సన్నివేశాలు ఎక్కువగా ఉండటం

కథ, కథనంలో సాగదీత

ప్రముఖ నటులకు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు దక్కడం

బాటమ్ లైన్ : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే

రేటింగ్ : 3/5

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -