భోజనం పెట్టలేదని భార్యని కొట్టి, హింసించి చంపేసిన భర్త!

Crime News: రోజురోజుకు మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. విలువలన్నీ దిగజారిపోతున్నాయి. ప్రేమానురాలు, ఆప్యాయత అంతరించిపోతోంది. చిన్న చిన్న కారణాలతో భార్య, భర్తల మధ్య గొడవలు, హత్యలు విడాకులు జరుగుతున్నాయి. క్షాణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబాలను అనథలను మిగుల్చుతున్నారు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలకు దిగి ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ఫోన్‌ ఎత్తలేదని భార్యను కొట్టడం, సరైన సమయానికి ఇంటికి రాలేదని చెల్లిని హింసించడం, వంట సరిగ్గ చేయలేదని కొట్టే క్రమంలో తగలరాని చోట దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు.
అలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.బయటి నుంచి వచ్చిన భర్తకు త్వరగా భోజనం పెట్టలేదని దారుణంగా కొట్టి హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. అందుకు సంబం«ధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మండల కేంద్రాంలోని జమునపల్లెకు చెందిన దాసరి చిన్న అంకలు, బసవమ్మ(35) భార్య భర్తలు. ఇరువురు దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అంకాలు తాగుడుకు బానిసయ్యాడు. ప్రతి రోజూ తాగి ఇంటికొచ్చి బసవమ్మతో గొడవకు దిగేవాడు. అప్పుడప్పుడు చేయి కూడా చేసుకునేవాడు. ఇరుగుపొరుగు వారు ఇద్దరిని సర్ధిచెప్పడంతో కొన్ని రోజులు సజావుగా సాగేది వీరి కుటుంబం. తర్వాత మళ్లీ మొదటికి వచ్చేది అంకాలు పరిస్థితి. ఎన్ని సార్లు చెప్పిన తన మాటనే నెగ్గించుకుంటూ భార్యను కొడుతూనే ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా ఫుటుగా తాగివచ్చిన అంకాలు వచ్చి రాగానే భోజనం పెట్టాలంటే భార్యతో గొడవకు దిగాడు. ఇరువురి మాట మాట పెరిగి గొడవ కాస్త పెద్దదైంది. కాసేపు ఊరుకున్న అంకాలు మళ్లీ గొడవ ప్రారంభించాడు. ఈ క్రమంలో తెల్లారే వరకు ఇద్దరు గొడవ పడుతూనే ఉన్నారు. కోపోద్రిక్తుడైన అంకాలు పక్కనే ఉన్న ఓ కర్రతో బలంగా కొట్టాడు ఆ కర్ర బసవమ్మ గుండెల్లో బలంగా గుచ్చుకోవడంతో రక్తపుమడుగుల్లో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అప్పటికే బసవమ్మ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భోజనం పెట్టలేదని భార్యను హతమార్చిన ఘటన స్థానికంగా చర్చానీయాంశంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -