Prakasam District: ఉద్యోగిని తీసుకెళ్లి లాడ్జిలో బంధించిన హిజ్రాలు.. ఆ తరువాత?

Prakasam District: సమాజంలో రాను రాను కొందరి హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయి. అయితే మామూలుగా హిజ్రాలు ప్రయాణికులను వ్యాపారస్తులని అలాగే వాహనదారులను అడ్డగించి డబ్బులను వసూలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొందరు డబ్బులు లేదు అనగానే విడిచిపెట్టగా మరి కొందరు మాత్రం డబ్బులు ఇచ్చే అంతవరకు కూడా సతాయిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొందరు హిజ్రాలు రూట్ మార్చేశారు. దౌర్జన్యాలకు పాల్పడడంతో పాటు రోడ్లపై వెళ్లే వారిని ట్రాప్ లోకి దించి వాళ్ళను బెదిరించి దోపిడీలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

 

 

అయితే ఇటీవల డిసెంబర్ 30వ తారీఖున శ్రీనివాస్ అనే 50 ఏళ్ల వ్యక్తి రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు హిజ్రాలు మాటలు చెబుతూ ఆటో దగ్గరకు తీసుకెళ్లి అందులో బలవంతంగా ఎక్కించారు. తర్వాత శ్రీనివాస్ నీ సమీపంలోని ఒక లాడ్జిలో బంధించారు. అయితే మొదట అతని దగ్గరున్న విలువైన వస్తువులు, డబ్బులు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ హిజ్రాలు అతని రాత్రి గదిలోనే బంధించి సెల్ ఫోన్ లో నగ్నంగా వీడియోలు ఫోటోలను తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని అతని బెదిరించి అతని దగ్గర ఉన్న డబ్బులు కావాలని కోరడంతో యూపీఐ పేమెంట్ ద్వారా దాదాపుగా 4 లక్షల రూపాయలు హిజ్రాల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించాడు.

 

అనంతరం అతని దగ్గర నుంచి డబ్బులు రావని తెలుసుకున్న హిజ్రాలు అతని లాడ్జిలోనే వదిలేసి పారిపోయారు. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిజ్రాల చేతిలో అవమానానికి గురవడమే కాకుండా ఆర్థికంగా నష్టపోయిన ఆ బాధితుడు అశోక్ నగర్ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హిజ్రాలు తీసుకెళ్లిన హోటల్ వివరాలు అలాగే పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -