Abbas: ఆ టాయిలెట్ క్లీనర్ డబ్బుతో కుటుంబాన్ని పోషించాను.. అబ్బాస్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Abbas: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా అప్పట్లో డ్రీమ్ బాయ్ గా కూడా భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్నాడు అబ్బాస్. ప్రేమదేశం సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకున్నాడు అబ్బాస్. పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పుట్టిన అబ్బాస్‌ తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో నటించి స్టార్‌ నటుడిగా మారాడు.


ఆ తర్వాత కాలంలో ఆయన సినిమాలకు దూరమవుతూ వచ్చారు. అలా ఒకప్పుడు హీరోగా, విలన్‌గా ప్రేక్షకులను అలరించిన నటుడు అబ్బాస్ కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. అబ్బాస్ కనుమరుగైపోయి దాదాపు 10 ఏళ్ళు అయ్యిందని చెప్పవచ్చు. ఇకపోతే గత కొద్ది రోజులుగా హీరో అబ్బాస్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే 50కి పైగా సినిమాలలో నటించి మెప్పించారు అబ్బాస్. కానీ 2015 తర్వాత, అతను అకస్మాత్తుగా నటనకు స్వస్తి చెప్పి, తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఆయన రీ ఎంట్రీ ప్లాన్‌ చేస్తున్నాడు.

 

అందుకోసం ఇండియాలోనే ఉండనున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నేను టాయిలెట్‌ క్లీనర్‌ను తాగమని ఆడగలేదు. బాత్రూంలో వాడండి అని చెప్పాను. టాయిలెట్‌ క్లీనర్‌ యాడ్‌లో నటించడం వల్ల నన్ను ఎంతోమంది ట్రోల్‌ చేశారు. నన్ను వెక్కిరిస్తూ చాలామంది కొన్ని వీడియోలు క్రియేట్‌ చేశారు. వాటి వల్ల నేను ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అలాగని వాళ్లు చేస్తున్న విమర్శలకు బాధపడలేదు. పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించడం కోసమే నేను ఆ ప్రకటనలో నటించాను. మీ ఇంటిని క్లీన్‌గా ఉంచడం, ఉంచకపోవడం అన్నది మీ ఇష్టం. ఆ యాడ్‌ చేస్తున్న సమయంలో నాకు అంత బిజీ పనులు ఏమీ లేవు. అందులో పనిచేసినందుకు వాళ్లు నాకు మంచి పారితోషికం ఇచ్చారు. మా మధ్య దాదాపు ఎనిమిదేళ్లు కాంట్రాక్ట్‌ కుదిరింది. అలా, వచ్చిన డబ్బుతో ఆ సమయంలో కుటుంబాన్ని పోషించాను. కాబట్టి అందులో తప్పేముంది. నేను వృత్తులన్నింటినీ ఒకేలా చూస్తాను ప్రతి ఒక్కరూ తమ కుటుంబం కోసమే కష్టపడుతుంటారు అని చెప్పుకొచ్చారు అబ్బాస్.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ...
- Advertisement -
- Advertisement -