Star Heroine: తాగే ఆలోచనతోనే నిద్ర లేస్తాను.. ఈ స్టార్ హీరోయిన్ కామెంట్లకు దండం పెట్టాల్సిందే!

Star Heroine: టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ గురించి మనందరికీ తెలిసిందే. వజ్రకాయ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ ఆ తర్వాత నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూచించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ హీరోయిన్ గా నటించే నభా నటేష్ కు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మెప్పించింది.

సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో హీరోయిన్ నబా నటేష్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది. అయితే ఈ సినిమా విడుదల అయిన తరువాత నభా నటేష్ ఇక తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అని అభిమానులు అందరూ భావించారు. కానీ ఆశించిన విధంగా ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు వచ్చినప్పటికీ కరోనా వల్ల, ఆ తరువాత యాక్సిడెంట్ కి గురయ్యి సర్జరీతో కొన్నాళ్ళు పాటు సినిమాలకు దూరం అవ్వడంతో ఆడియన్స్ తో పాటు మూవీ మేకర్స్ కూడా నభా నటేష్ ని మర్చిపోయారు.

 

ఇక ఇటీవలే ఆమె పూర్తిగా కోలుకొని మళ్ళీ తిరిగి వచ్చింది. సినిమాల్లో ఛాన్సులు కోసం అనేక ఫోటోషూట్స్ చేస్తూ తెగ ప్రయత్నిస్తుంది. కానీ ఈ అమ్మడిని ఏ ఆఫర్ వరించడం లేదు. కాగా తాజాగా ఈ భామమార్నింగ్ లేవగానే మేకప్ లేకుండా కొన్ని ఫోటోలు దిగి వాటిని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ ని కూడా జోడించింది. ప్రతిరోజు ఉదయం ప్రతి ఒక్కరు ఏదొక ఆలోచనతోనే మేల్కొంటారు. ఆ ఆలోచన జీవిత లక్ష్యం అయ్యుండొచ్చు లేదా రోజు వచ్చే సాధారణ ఆలోచనలు అయ్యుండొచ్చు. అలాగే కొందరిలో ఈ ఆలోచనలు స్థిరంగా ఉండొచ్చు లేదా వాతావరణం లా మారిపోతూ కూడా ఉండవచ్చు. అయితే నన్ను ప్రతిరోజు నిద్ర లేపింది మాత్రం ఒకటే ఆలోచన. అదే కాఫీ తాగడం. కాఫీ తాగాలనే ఆలోచనతోనే ప్రతిరోజు నిద్ర లేస్తాను అని రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం అందుకు సంబందించిన పోస్ట్ ఫోటోస్ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -