Spirituality: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది వరకు పాటించాల్సిన నియమాలు ఇవే?

Spirituality: మాములుగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైన మరణిస్తే అనేక నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇంట్లో దీపం వెలిగించకూడదని ఆలయాలకు వెళ్ళకూడదు అని కొబ్బరికాయ కొట్టకూడదని ఇలా అనేక నియమాలను పాటిస్తూ ఉంటారు. కొందరు అయితే దేవుడి ఫోటోలను ఒక బట్టలో చుట్టేసి పైన పెట్టేస్తూ ఉంటారు. అలా సంవత్సరికం అయిపోయిన తర్వాత మళ్లీ ఇల్లంతా శుభ్రం చేసి దేవుడికి దీపం వెలిగిస్తూ ఉంటారు. అయితే మరి ఈ విషయంపై శాస్త్రం ఏమంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా దీపం లేని ఇల్లు స్మశానంతో సమానం అంటూ ఉంటారు.
దీపం శుభానికి సంకేతం.

భక్తితో దీపం వెలిగిస్తే అక్కడ దేవతలు తిరుగుతారని విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఇంట్లోనూ నిత్య దీపారాధన చేయాలి అని చెబుతూ ఉంటారు. మాములుగా ఎవరైనా మరణించినప్పుడు దీపం వెలిగించం కదా అంటారేమో అప్పుడు కూడా 11 రోజులకు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12 వ రోజు నుంచి నిత్యదీపారాధన కొనసాగించవచ్చు. పండుగలు, ప్రత్యేకత పూజలు, శుభకార్యాలు చేయకూడదు కానీ దీపం పెట్టడం మాత్రం మానెయ్యకూడదు. ఆలయాలకు వెళ్లకూడదనే నిబంధన కూడా ఏమీలేదు వెళ్లినా కానీ అర్చనలు, అభిషేకాలు చేయించకూడదు దైవ దర్శనం చేసుకోవచ్చు.

 

ఇంట్లో దోషాలు ఆపే శక్తి దీపానికి మాత్రామే ఉంటుంది. దేవుడి మందిరంలో ఫొటోలన్నింటికీ బొట్టు పెట్టి, వాటి ముందు దీపం వెలిగించి, నైవేద్యం సమర్పిస్తుంటారు. అంటే ఆ ఫొటోల్లోకి దేవతలను ఆహ్వానిస్తారన్నమాట. అలా ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేద్యం లాంటి ఉపచారాలు చేయకుండా పక్కనపెట్టేస్తే అది పెద్ద దోషమే అంటున్నారు పండితులు. ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని దీపం ఆపుతుంది. అందుకే నిత్య దీపారాధన మానెయ్యరాదని చెబుతారు.
అయితే గుడికి వెళ్ళవచ్చు కానీ అర్చనలు, ప్రత్యేక పూజలు చేయకూడదు. అలాగే గృహాప్రవేశాలు, కేశఖండన లాంటి శుభకార్యాలు చేయకూడదు. కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కొట్టకూడదు. ప్రత్యేకమైన అభిషేకాలు, వ్రతాలు చేయకూడదు. ఇవి కూడా ఇంట్లో పెద్దవారు పోతేనే ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. చిన్నవారు పోతే ద్వాదశ కర్మ తర్వాత అన్నీ యధావిధిగా ఆచరించవచ్చు. ఇందులో సందేహాలేమైనా ఉంటే మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన పండితులను అడిగి నివృతి చేసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -