Spirituality: గుడి వెనక అలా నమస్కారం చేస్తున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే?

Spirituality: సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని నమస్కరించుకుంటూ ఉంటాము. గుడిలోకి ప్రవేశం చేసే సమయంలో, బయట ధ్వజస్తంభం దగ్గర, ప్రధాన ద్వారానికి, గుడి లోపలి పిల్లలు తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ప్రతిక్షణలు చేసే సమయంలో గర్భగుడికి వెనుకభాగం వైపు కూడా నమస్కరిస్తారు. అయితే అలా ఎప్పుడు చేయకూడదంటున్నారు పండితులు. ఎందుకంటె గుడి వెనుకభాగాన్ని బలిపీఠం అంటారు. ఆ భాగంవద్ద తాకడం లాంటివి కూడా చేయకూడదు.

ఇంకా చెప్పాలంటే బలిపీఠాన్ని అర్చకులు తప్ప ఎవ్వరూ ముట్టుకోకూడదు. అక్కడ ఏమీ పెట్టకూడదు. అయితే ఇప్పటి వరకు గుడి వెనకాల బాగానే తాకడం తల ఆణించి మొక్కుకోవడం లాంటివి చేసి ఉంటే ఇకపై అలాంటివి చేయకపోవడమే మంచిది. కాగా
ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు.

 

గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి. బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. బలి బుక్కుల వల్ల కంటికి కనిపించే కుక్క, కాకి, పక్షులు, చీమలు, పురుగులు, కనిపించని సూక్ష్మజీవులు ఎన్నో తృప్తి చెందుతాయి. తప్పనిసరిగా బలిబుక్కులు ఇవ్వాలనేది శాస్త్ర నియమం. బలిపీఠంపై వేసిన అన్నం దేవతలకు మాత్రమే ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు. ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కుల్లోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు. ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -