Ayodhya: ఈరోజు శ్రీరాముడిని ఇలా పూజిస్తే అయోధ్యకు వెళ్లినంత పుణ్యం పొందవచ్చా?

Ayodhya: కోట్లాదిమంది హిందువుల కల, 500 సంవత్సరాల అలుపెరుగని పోరాటం తర్వాత నెరవేరబోతున్న కల మరి కొంతసేపట్లో తీరబోతుంది. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు బాల రాముని ప్రాణప్రతిష్ట జరిగే రోజునేడు. మరి కాసేపట్లో రాముని ప్రాణప్రతిష్ట జరగబోతున్న సమయంలో అలాంటి వేడుకని కనులారా చూడాలని ప్రతి హిందువు ఆశపడతాడు. అయితే ఆ కల అందరికీ నెరవేరకపోవచ్చు అయినా ఎటువంటి నిరాశ చెందకుండా ఇంట్లోనే రాముని విగ్రహానికి ఈ విధంగా పూజ చేసుకుంటే అయోధ్య రాముని అనుగ్రహం పొందవచ్చు.

 

అందుకోసం మీరు ఏం చేస్తారంటే జనవరి 22న వేకువ జామున నిద్రలేచి పవిత్ర గంగా నదిలో స్నానమాచరించాలి. మీ ఇంట్లో పూజ మందిరంలో పీట వేసి దానిమీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముని ప్రతిమను దాని మీద పెట్టాలి. తూర్పు ముఖంగా కూర్చుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. దీప ధూప నైవేద్యాలు సమర్పించి ఆపై నైవేద్యం సమర్పించాలి. ఆ సమయంలో హనుమంతుడిని కూడా అంతే భక్తితో పూజించడం ఎంతో అవసరం. ఈ పవిత్రమైన రోజు రామచరిత మానస్, శ్రీరామరక్ష స్తోత్రం, సుందరకాండని పారాయణం చేయడం వలన పుణ్యఫలం దక్కుతుంది.

బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంతా 11 గంటల నుంచి ఒంటిగంట వరకు దూరదర్శన్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పండితులు చెప్పిన సమయంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు తల మీద వేసుకోవడం వలన శ్రీరాముడు ఆశీర్వాదం పొందిన వాళ్లు అవుతారు. ఇప్పటికే ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులు అన్ని ఒక్కొక్కటిగా నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నాయి.

 

ఇక ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగడంతో ప్రతి హిందువు కల నెరవేరుతుంది. ఇక ఇదే రోజు క్షీరసాగర మదనం సమయంలో విష్ణుమూర్తి కూర్మ అవతారం ఎత్తిన రోజు. అందువల్ల కూర్మ ద్వాదశి రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. విష్ణు సహస్రనామ పారాయణం చేసి పూజ చేసుకుంటే మోక్షం లభిస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజు రామనామ జపంతో గడుపుతూ రాముని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -