Viral: వైరల్ అవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ కామెంట్స్!

Viral: యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎట్టకేలకు ముగిసింది. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మహా వేడుకకు పెద్ద పెద్ద ప్రముఖులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేలాది ప్రముఖులు ఈ వేడుకకు హాజరవగా కోట్లాది జనులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. దాదాపుగా 500 ఏళ్ల నాటి కల నేటితో సాకారం అవడంతో అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా జై శ్రీ రామ్ అనే నామ స్మరణతో మారుమోగిపోయింది. కాగా పెద్ద పెద్ద ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు రాములవారిని దర్శించుకున్న అనంతరం సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టులు రాసుకొచ్చారు.

 

అందులో భాగంగానే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్ చేశారు. రాంలల్లా శంకుస్థాపన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. సీతా సమేత రామచంద్ర స్వామికి జై. ఈరోజు మన రాముడు వచ్చాడు. 22 జనవరి 2024 నాటి ఈ సూర్యుడు కొత్త ప్రకాశాన్ని తెచ్చాడు. చాలా చెప్పాలనుకుంటున్నాను.. అయితే గొంతు మూసుకుపోయింది. ఈ క్షణం అతీంద్రియమైనది. పవిత్రమైనది. శతాబ్దాల తపస్సు తర్వాత రాముడు తిరిగి వచ్చాడు. ఈరోజు నేను కూడా శ్రీరామునికి క్షమాపణలు చెబుతున్నాను. ఇన్ని శతాబ్దాలుగా మనం ఈ పని చేయలేకపోవడానికి మన కృషి, త్యాగం, తపస్సులో ఏదో లోటు ఉండాలి.

 

నేడు ఆ లోటు తీరింది. శ్రీ రాముడు ఈరోజు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను. వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీ, ఈ క్షణం గురించి మాట్లాడతారు. మనమందరం ఈ క్షణాన్ని జీవిస్తున్నాము. ఈ కార్యక్రమం జరుగడం శ్రీరాముడి ఆశీర్వాద ఫలం. రామ్ లల్లా ఇకపై గుడారంలో ఉండరు. ఇకపై దివ్య మందిరంలో నివసిస్తారు. దేశంలో, ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న రామభక్తులకు ఇది సంతోషకరమైన రోజు అని విశ్వసిస్తున్నారు. ఈ క్షణం మనందరికీ శ్రీరాముడి ఆశీర్వాదం లభిస్తుంది అని తెలిపారు నరేంద్ర మోడీ. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -