Chiranjeevi: రామునిపై భక్తిని చాటుకున్న చిరంజీవి.. అలా కామెంట్లు చేస్తూ?

Chiranjeevi: దేశం మొత్తం ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది ప్రతి హిందువు గర్వంతో పొంగిపోయే రోజు ఇది. మోడీ చేతుల మీదుగా రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేడుకని కనులారా చూడాలని ఇప్పటికే ఎంతోమంది అయోధ్యకి చేరుకున్నారు. భారతదేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు నాలుగు వేల మంది సాధువులు పాల్గొంటున్నారు.

ఈ మహా కార్యక్రమం కోసం దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు, లక్షల మంది భక్తులు అయోధ్యకు విచ్చేశారు. అలాగే ప్రభుత్వ ఆహ్వానం మీద విఐపిలు సైతం ఎంతో ఆసక్తితో అక్కడికి చేరుకున్నారు. అయితే ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక ట్వీట్ చేశారు. అయోధ్యలో రామ్ లల్లా పట్టాభిషేకానికి ఆహ్వానం రావడం దేవుడిచ్చిన అవకాశం గా భావిస్తున్నట్లు తెలిపారు. చరిత్ర సృష్టిస్తోంది, చరిత్రను ఉర్రూతలూగిస్తోంది.

 

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి. అయోధ్యలో రాములల్లా పట్టాభిషేకం చూసే ఆహ్వానం రావడం నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.500 సంవత్సరాలకు పైగా తరతరాలుగా వేచి చూస్తున్న భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న మహత్తర అధ్యాయం. చిరంజీవి అయిన హనుమంతుడు అంజనాదేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనాదేవి కుమారుడు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతి ఇచ్చినట్లుగా అనిపిస్తుంది.

 

నాకు నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం. నిజంగా ఈ అనుభూతి వర్ణించలేనిది ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి జి గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా జై శ్రీరామ్ అంటూ భావోద్వేగమైన కూడిన ఒక పోస్ట్ చేశారు చిరంజీవి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -