Navagraha: న‌వ‌గ్ర‌హాలు అనుకూలించాలంటే చేయాల్సిన పనులివే.. ఈ తప్పులు చేయొద్దంటూ?

Navagraha: మన జాతకంలోభాగంగా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఎలాంటి పనులు చేయాలన్నా కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. అలాగే మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ కష్టాలు కాని తలెత్తవు అయితే గ్రహాలు అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనం కొన్ని పనులను చేయాలి అయితే కొంతమంది తెలిసి తెలియక తప్పులు చేయటం వల్ల కూడా గ్రహాలప్రతికూల ప్రభావం మనపై ఉంటుంది మరి గ్రహాలు అనుకూలించాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే..

రవి చంద్రగ్రహాలు అనుకూలించాలి అంటే ఇంట్లో తల్లిదండ్రులను తప్పనిసరిగా గౌరవించాలి వారిని గౌరవించే వారికి మర్యాద చేసినప్పుడే రవిచంద్ర గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. గురు బలం పొందాలన్న గురు గ్రహం అనుకూలించాలన్న మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఎప్పుడూ కూడా గౌరవించాలి అదేవిధంగా అబ్బాయిలు పసుపులోకి కొద్దిగా పాలు వేసి దానిని హద్దుట పెట్టుకోవాలి అమ్మాయిలైతే మొహం మొత్తం పసుపు రాసుకోవడం వల్ల గురుగ్రహబలం పొందవచ్చు.

 

శుక్ర గ్రహ అనుకూలం పొందాలి అంటే ఇంట్లో తప్పనిసరిగా ఆడపిల్లలు ఉంటే వారిని గౌరవించాలి వారిని ఎలా పడితే అలా తిట్టకూడదు. ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే మేనత్తకు అలాంటి మర్యాద ఇవ్వాలి మేనత్త కూడా లేకపోతే తల్లికి ఇలాంటి గౌరవం ఇవ్వడం వల్ల శుక్ర గ్రహం అనుకూలం పొందవచ్చు.శని గ్రహం అనుకూలించాలి అంటే మన ఇంట్లో పని చేస్తున్నటువంటి పని వాళ్లకు తగిన వేతనం ఇచ్చి వారిని గౌరవించాలి ఇంట్లో పని వాళ్ళు లేకపోతే బయట పేదవారికి తగిన సహాయం చేయడం వల్ల శని గ్రహ అనుకూలం పొందవచ్చు.

 

లగ్నకుండలి ఆధారంగా కొందరి జాతకంలో చూసినట్లయితే అన్నదానం చేయకూడదు.ఇలా అన్నం తినడం వల్ల వాళ్లు యజమానులను మోసం చేస్తారట అదే విధంగా బంధువులు కొంతకాలం పాటు మన ఇంట్లో ఉండి మనల్ని మోసం చేసి వెళ్తారట. రవి అనుగ్రహం కోసం ఎవరి దగ్గర ఏ వస్తువుని ఫ్రీగా తీసుకోకూడదు. కుజుడి స్థితిని బట్టి కొందరు చక్కెర వ్యాపారం అసలు చేయకూడదు. బుధుడి స్థితిని బట్టి కొంతమంది మాంసాహారం, గుడ్లు, చేపలు తినకూడదు. గురువు యొక్క స్థితిని ఆధారంగా సాధువులకి, సన్యాసులకి సహాయం చేయకూడదు. రాహు స్థితి ఆధారంగా నీలం రంగు బట్టలు నలుపు రంగు బట్టలు ధరించకూడదు కేతువు స్థితి ఆధారంగాతప్పుడు వాగ్దానాలు చేయకూడదు అలాగే ఎవరికైతే సంతానం ఉండదు వారి నుంచి భూమి కొనుగోలు చేయకూడదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -