Devotional: ఈ తప్పులు చేస్తే అన్నీ అరిష్టాలే.. అలా నష్టపోయే ఛాన్స్ ఉందా?

Devotional: సాధారణంగా ప్రతి ఒక్కరు జీవితంలో వారి గ్రహస్థానాలు కారణంగా కొన్ని జాతక దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇలాంటి జాతక దోషాలు ఏర్పడిన సమయంలో దోష నివారణ చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇలా ఎప్పుడైతే నవగ్రహ దోష పరిహారం చేసుకోకుండా ఉంటామో అలాంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు కలగడం, ఏ పని చేసిన కలిసి రాకపోవడం జరుగుతుంది. అయితే ఈ విధమైనటువంటి దోషాలు రావడానికి మనం కొన్ని సార్లు చేసే తప్పులు కూడా కారణమని తెలుస్తుంది.

మరి మనం ఎలాంటి తప్పులు చేయడం వల్ల గ్రహ దోషాలు ఏర్పడతాయనే విషయానికి వస్తే… ఇంట్లో మనం శుక్రవారం లేదా శనివారం కానీ తరచు ఏడుస్తున్నట్టు ఉంటే గ్రహ దోషాలు ఏర్పడతాయి. మనం తరచూ పలు ఆలయాలకు వెళ్తూ ఉంటాము అయితే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నవగ్రహాలకు చాలామంది పూజించరు. అయితే ఇలా నవగ్రహాలను పూజించకుండా ఎప్పుడైతే వస్తామో అలాంటి సమయంలో నవగ్రహ దోషాలకు గురికావాల్సి ఉంటుంది.

 

సాధారణంగా జన్మదినాన్ని ప్రతి ఒక్కరు జరుపుకుంటారు ఇలాంటి జన్మదినం రోజున ఎవరైతే దానధర్మాలను చేయకుండా ఉంటారో వారికి శని గ్రహ పీడలు వేధిస్తాయి. సోమవారం నాడు శివాభిషేకం చేయకపోతే, ఇంట్లో గ్రహాలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి. ఇక మంగళవారం హనుమంతుడికి అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి, గోధుమలతో చేసిన పదార్థాలు పెట్టి వాటిని ఏదైనా జీవులకి దానం చేస్తే ఏలినాటి శని పోతుంది.

 

ఇక శనివారం వెంకటేశ్వర స్వామికి తులసీదళాలను సమర్పించడం ఎంతో మంచిది ఇలా తులసి దళాలను సమర్పించిన అనంతరంబియ్యపు పిండితో ప్రమిదను తయారుచేసి తొమ్మిది వత్తులతో దీపం వెలిగించడం వల్ల సర్వ దోషాలు తొలగిపోతాయి. ఇలా మనం ఇలాంటి తప్పులను కనుక చేయకుండా ఉంటే మనకు ఏ విధమైనటువంటి గ్రహ దోషాలు ఉండవని లేకపోతే గ్రహ దోషాల బారిన పడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -