Lord Shiva: ఈ పూలతో శివుడిని పూజిస్తే ఏడు జన్మల పాపం పోతుందట.. ఏం జరిగిందంటే?

Lord Shiva: హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్లలో పరమేశ్వరుడు కూడా ఒకరు. సోమవారం రోజున శివుడిని భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా శివునికి ఇష్టమైన పువ్వులను, ప్రసాద్ అన్న సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటుగా ఈ పూలతో పూజిస్తే ఏడేడు జన్మల పాపం పోతుందట. ఇంతకీ ఆ పూలు ఏమిటి? శివుడిని ఎలా పూజించాలి అన్న వివరాల్లోకి వెళితే.. శివుడికి ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం. ఒక ఉమ్మెత్త పువ్వుని శివుడికి పెడితే మోక్షం లభిస్తుంది. మాంగళ్య‌ భాగ్యం లభించాలంటే శివుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలి.

ఉమ్మెత్త పూలతో మాల కట్టి శివుడికి వేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులు అంటే ఇష్టం. దుర్గాదేవిని కూడా ఉమ్మెత్త పూలతో పూజించ‌వ‌చ్చు. దుర్గాదేవిని కనుక ఉమ్మెత్త పూలతో పూజించారంటే దరిద్రం అంతా తొలగిపోతుంది. నవరాత్రి రోజుల్లో ఏడవ రోజు సరస్వతీ దేవికి ఉమ్మెత్త పువ్వులతో అలంకరణ చేస్తారు. ఆ రోజు సరస్వతీ దేవి అనుగ్రహం పొందాలంటే ఉమ్మెత్త పువ్వులతో రంగోళీ వేసి పూజించడం వలన చక్కటి ఫలితాలు లభిస్తాయి. అదేవిధంగా ప్రదోషకాలంలో శివుడికి ఈ పూలని పెట్టడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి.

 

సర్ప దోషంతో బాధపడే వారు లేదంటే ఇతర దోషాల వలన సతమతమయ్యే వాళ్ళు, శివుడిని ఆరాధించడం మంచిది. నెలకు రెండు సార్లు ప్రదోషం వస్తుంది. అమావాస్య, పౌర్ణమికి ఒక రోజు ముందు అలాంటి సమయంలో శివుడిని కొలిచినట్లయితే, శివుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సమస్త దేవతల‌ అనుగ్రహం కూడా కలుగుతుంది. ప్రదోషం రోజున సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల సమయంలో శివుడిని ఆరాధించడం మంచిది. శివుడు అభిషేక ప్రియుడు కనుక ఆ రోజు శివుడికి అభిషేకం చేస్తే కూడా మంచి ఫలితం కనబడుతుంది. బిల్వపత్రాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం మంచిది. ఇలా శివుడిని ఈ విధంగా పూజించి కష్టాల నుండి బయటపడవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -