Marriage: పెళ్లి కాని వాళ్లకు అలర్ట్.. ఈ పని చేస్తే మాత్రం పెళ్లి జరగడం ఖాయమా?

Marriage: ఈ రోజుల్లో చాలామంది స్త్రీ పురుషులు కెరియర్ కెరియర్ అంటూ డబ్బు సంపాదించడం పై దృష్టి పెట్టి మూడు పదులు నాలుగు పదుల వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటున్నారు. ఇక తీరా పెళ్లి వయసు దాటిపోయిన తర్వాత పెళ్లి సంబంధాల కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా సరిపోవడం లేదని కొన్ని కొన్ని సార్లు ఆత్మహత్య చేసుకోవడం లాంటి పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటారు.. అందుకే పూర్వం పెద్దలు ఒక మాట చెప్పేవారు..

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరిగితేనే మంచిది అని. అందుకే పెళ్లి వయసు దాటిపోయేంతవరకు ఉండకుండా పెళ్లి చేసుకోమని చెప్పిన కూడా వినిపించుకోకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులకు పాల్పడుతూ ఉంటారు. అయితే పెళ్లి సంబంధాలు కుదరడం లేదని చాలామంది చింతిస్తూ ఉంటారు. ఇకపై మీకు చింత అక్కర్లేదు.. పెళ్లి అవ్వట్లేదు అని చింతించే వారు ఇలా చేస్తే చక్కటి పరిష్కారం కనబడుతుంది. కొంత మందికి త్వరగా పెళ్లి అయిపోతే కొంత మందికి ఆలస్యంగా కుదురుతుంది. చాలా మంది వివాహం కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు.అమ్మాయిలు లేదా అబ్బాయిలు జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వారికి తగ్గ వాళ్లని ఎంచుకుంటూ ఉంటారు.

 

పైగా కొంత మంది పెళ్లి మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని అబ్బాయి ఇలా ఉండాలి, లేదా అమ్మాయి ఇలా ఉండాలి అని రిజక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు సోమవారం నాడు ఉపవాసం ఉంటే అన్ని సమస్యలకి పరిష్కారం కనబడుతుంది. శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతోమంది చూస్తూ ఉంటారు. శివుడిని ఇలా ఆరాధిస్తే పెళ్లి అయిపోయినట్టే. శ్రావణమాసం శివుడికి ఎంతో ఇష్టమైనది. ఈ శ్రావణ మాసంలో ఎనిమిది సోమవారాలు వచ్చాయి. కాబట్టి మీరు శివుడిని ప్రసన్నం చేసుకోండి. శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉపవాసం చేస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది. అలానే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి నియమాల ప్రకారం శివుడిని ఆరాధించండి. ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపిస్తే కూడా శివుడి అనుగ్రహం కలుగుతుంది. శివ పార్వతుల్ని పూజించేటప్పుడు 108 బిల్వపత్రాలను తీసుకుని పూజిస్తే కూడా చక్కటి ఫలితం కనబడుతుంది. ఇలా మీరు శివుడిని ఆరాధించడం వలన త్వరగా పెళ్లి అయిపోతుంది. శివుడిని ఆరాధించేటప్పుడు పసుపు రంగు బట్టలు వేసుకోవడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -