Lord Venkateswara: శనివారం రోజున వేంకటేశ్వర స్వామిని ఇలా పూజిస్తే కోటీశ్వరులు అవుతారట.. ఏమైందంటే?

Lord Venkateswara: ప్రతిరోజు దేవునికి దీపారాధన ఎంతో మంచిది, అలాగే పూజ, జపం చేయటం వలన పుణ్యంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది కానీ శనివారం రోజు పూజిస్తే అది ఇంకా శ్రేష్టం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే మహాప్రీతి. దానికి కారణం.. ఓంకారం ప్రభవించిన రోజు శనివారం, వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం.

 

శనివారం శ్రీనివాసుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే శనీశ్వరుడు భక్తులను పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం. ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం. అందుకే శనివారం రోజు భక్తులు వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకొని తమకు ఎదురయ్యే కష్టాలని సమస్యలని గట్టికించమని భగవంతుడిని ప్రార్థిస్తారు. శనివారం నాడు పిండి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి సుచిగా స్నానం ఆచరించి పూజ గదిలో వెంకటేసుని విగ్రహం వుంచి సాక్షాత్తు శ్రీహరిగా భావించాలి. పఠాలని పువ్వులతో అలంకరించి దీపం వెలిగించాలి. అలాగే స్వామిని తులసి దళాలతో అర్చన చేయాలి. తరువాత దీప, ధూప, నైవేద్యాలని సమర్పించుకోవాలి. మన తాహతుకు తగ్గట్టుగా ఏది వీలైతే అది నైవేద్యం సమర్పించవచ్చు. వెంకటేశ్వర స్వామి మహత్యంతో కూడిన పుస్తకాలను వాయనం ఇవ్వటం వల్ల చాలా పుణ్యం వస్తుంది.

 

అలాగే పూజ చేసేటప్పుడు “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని జపించాలి. ఆరోగ్యం బాగున్నవారు ఉపవాసం చేయడం చాలా మంచిది. లేకపోతే ఒంటి పూట భోజనం చేసినా కూడా మంచి జరుగుతుంది. సాయంత్రం అయిన తర్వాత మళ్లీ సుజిగా స్నానం చేసి బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి. దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఏడు వారాలు చేస్తే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని, అనుకున్న కార్యం సిద్ధిస్తుందని పెద్దవాళ్ళు చెబుతారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -