Saturday: శనివారం ఈ పనులు చేస్తే దురదృష్టం కచ్చితంగా దూరమవుతుందా?

Saturday: సాధారణంగా ప్రతి ఒక్కరి జాతకం గ్రహదోషాల కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ శని తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఈ జాతక చక్రాల కారణంగా కొందరిలో శని అదృష్టాన్ని తీసుకొస్తే మరికొందరికి దురదృష్టాన్ని తీసుకువస్తారు. అయితే శని ప్రభావం మనపై కఠినంగా ఉన్నట్లయితే మనం అనుకున్న పనులు ఏవి సవ్యంగా సాగవు. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి ఇలాంటి ఇబ్బందులు కనక ఎదురైనప్పుడు ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే ఈ పరిహారాలు కనుక పాటిస్తే శని బాధల నుంచి మనం బయటపడవచ్చు. మరి ఆ పరిహారాలు ఏంటి అనే విషయానికి వస్తే…

రుద్రాక్ష ధరించడం: శని ప్రభావం కారణంగా మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఆటుపోట్లు ఎదురవుతుంటే కనుక సోమవారం గంగాజలంతో కడిగిన సత్ముఖి రుద్రాక్షలను ధరించడం ఎంతో మంచిది. ధరించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవు.

 

హనుమాన్ ఆరాధన: పురాణాల ప్రకారం శని దేవుడు ఆంజనేయుడికి ఒక వాగ్దానం చేశారట నిన్ను పూజించే వారిపై నా ప్రభావం ఏ విధంగానో ఉండదని వాగ్దానం చేశారు. అందుకే ఎవరైతే హనుమంతుడిని శనివారం పూజించి హనుమాన్ చాలీసా చదువుతారో అలాంటి వారిపై శని ప్రభావం ఉండదు.

 

రావి చెట్టుకు పూజ చేయడం: రావి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని భావిస్తారు. అందుకే రావి చెట్టుకు పూజ చేయడం వల్ల శని ప్రభావ దోషాలు కూడా తొలగిపోయి శని బాధల నుంచి బయటపడతారు. శనివారం రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయటం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.

 

ఆవనూనె దానం చేయడం: శనివారం రోజున ఆవనూనెను ఇతరులకు దానం చేయాలి ఇలా మరుసటి శనివారం వరకు దానం చేయటం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది అయితే ఈ ఆవనూనె దానం చేసేటప్పుడు దానిని ఒక గిన్నెలో పోసి అందులో మీ ముఖం చూసుకొని దానం చేయడం ఎంతో మంచిది అలాగే శనివారం రోజున ఆవనూనెతో తయారు చేసిన రొట్టెను కుక్కకు తినిపించడం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -