Cricketer Mohammed Siraj: ఆటో నడుపుకో అంటూ అవమానాలు.. ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీశాడు.. సిరాజ్ సక్సెస్ స్టోరీ ఇదే!

Cricketer Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాడు. అతను ఒక సామాన్య ఆటో డ్రైవర్ కొడుకు. తండ్రి గౌస్ మహమ్మద్. అతను 2015- 2016 రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడటం ద్వారా, నవంబర్ 15, 2015న ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసిన ఏకైక భారతీయ బౌలర్ గా సిరాజ్ కి మంచి గుర్తింపు ఉంది. అయితే ఇంత సక్సెస్ సాధించిన ఈ వ్యక్తి వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు ఉన్నాయి.

వాటి గురించే చెప్పుకొచ్చాడు సిరాజ్. ఏడో తరగతి నుంచి తాను స్కూల్ జట్టు తరఫున ఆడేవాడినని మొదట బ్యాట్స్మెన్ అని తర్వాత టెన్త్ లో బౌలర్గా మారానని చెప్పుకొచ్చిన సిరాజ్ పదో తరగతి తర్వాత చదువు ఆపేసి ఇంటి దగ్గర ఉండే గ్రౌండ్లో రోజు టెన్నిస్ బాల్ మ్యాచ్లు ఆడే వాడినని చెప్పుకొచ్చాడు. అయితే అన్నయ్య బీటెక్ చదువుతుంటే నేను ఆటలు ఆడేవాడినని అమ్మ కోప్పడేదని కానీ నాన్న ఆటో నడపగా వచ్చిన డబ్బుతో పాకెట్ మనీ ఇచ్చే వారిని చెప్పుకొచ్చాడు సిరాజ్.

తన మామయ్యకి క్రికెట్ క్లబ్ ఉండేదని అందులో ఒకసారి జరిగిన మ్యాచ్లో 9 వికెట్లు తీయడంతో తన మామయ్య తనని ప్రోత్సహించారని, ఆ మ్యాచ్ కి తను 500 రూపాయల పారితోషికం తీసుకున్నట్లు చెప్పాడు సిరాజ్. 2016లో ఐపీఎల్ మ్యాచ్ కి నెట్ బౌలర్గా పనిచేశానని, హైదరాబాదు జట్టుకు కోచ్గా వెళ్లిన సమయంలో 45 వికెట్లు తీశానని, 2017 ఐపిఎల్ సీజన్లో సన్రైజర్స్ తనని 2.6 కోట్లకి కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు సిరాజ్.

అయితే ఈ సక్సెస్ వెనక ఎన్నో అవమానాలు ఉన్నాయి. చాలామంది నన్ను ఇదంతా నీకు అవసరమా ఆటో తోలుకో అన్నట్లు మాట్లాడారు. అయితే కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత నేను తల్లిదండ్రులకి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకున్నాను. కానీ నా సక్సెస్ ని పూర్తిగా చూడకుండానే తండ్రి మరణించడం చాలా బాధాకరం అన్నారు. తండ్రి చనిపోయిన సమయంలో అతను ఆస్ట్రేలియా లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -