Mohammed Siraj: శభాష్ హైదరాబాదీ.. సిరాజ్ మ్యాచ్ తో పాటు వాళ్ల మనస్సులను కూడా గెలిచాడుగా!

Mohammed Siraj: ఆసియా కప్ ఫైనల్లో మహమ్మద్ సిరాజ్ ఆట అందరిని ఎంత కట్టిపడేసిందో అలాగే అతని మంచి మనసు కూడా అందర్నీ అలాగే కట్టిపడేసింది. 5 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 4.15 లక్షల ప్రైజ్ మనీని శ్రీలంక గ్రౌండ్ స్టాప్ కి ఇచ్చేశాడు సిరాజ్. అందుకు కారణాన్ని కూడా చెప్పాడు మహమ్మద్ సిరాజ్. వర్షం కారణంగా ఎఫెక్ట్ అయిన ఈ టోర్నమెంటులో గ్రౌండ్ స్టాప్ ఎంతో కష్టపడ్డారు. ఈ క్యాష్ ప్రైస్ గ్రౌండ్స్ మెన్ కు ఇచ్చేస్తున్నాను.

ఈ ప్రైజ్ తీసుకోవటానికి వారు పూర్తిగా అర్హులు. వారి కృషి లేకపోతే ఈ టోర్నమెంట్ జరిగేది కాదు. ఇదంతా ఒక కలలా ఉంది ఈరోజు పిచ్ ఎక్కువ స్వింగ్ కి అనుకూలించింది. దీంతో ఎక్కువ వికెట్లు పడగొట్టగలిగాను అని అన్నాడు. నిజానికి ఆసియా కప్ లో దాదాపుగా శ్రీలంకలో జరిగిన అన్ని మ్యాచ్లు వర్షం కారణంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఆఖరికి ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా ఆలస్యమైంది.

భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వగా, రెండో మ్యాచ్ కూడా రిజర్వ్ డే నాడు జరిగింది. మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. కానీ వారి నిర్ణయం తక్కువ సమయంలోనే తప్పని తేలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే ఓపెనర్ కుషాల్ పెరీరా వికెట్ పడగొట్టి బూమ్రా భారత్ కు మొదటి వికెట్ అందించాడు. దీంతో శ్రీలంక స్కోరు బోర్డుపై ఒక పరుగు తీసేసరికి తన మొదటి వికెట్ కోల్పోయింది.

తర్వాత వెంట వెంటనే ఐదు వికెట్లు కోల్పోయి ఆపై ఓటమికి గురైంది శ్రీలంక. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన సిరాజ్ 7 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టడం జరిగింది. ఈ అద్భుతమైన ఆటకిగాను అతనికి మెన్ అఫ్ ది మ్యాచ్ వరించింది. ఏదైతేనేం మన హైదరాబాద్ కుర్రాడు ఇంతటి ఘనత సాధించడం గర్వకారణం. అలాగే ఈ క్రికెటర్ పై దర్శక దిగ్గజం రాజమౌళి సైతం ప్రశంసల జల్లు కురిపించాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -