Marriage: పెళ్లిలో రోలు, రోకలి పూజించడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Marriage: సాధారణంగా పెళ్లి అంటే మూడు ముళ్ళు ఏడడుగులు అని అంటూ ఉంటారు. అంతేనా అంతే కదా ఇంకేముంది అని చాలామంది అంటూ ఉంటారు. కానీ పెళ్లి అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవడం, రెండు మనసులను ఒకటి చేయడం, రెండు కుటుంబాలను ఒకటి చేయడం, పందిళ్లు వేయడం, మామిడాకుల తోరణాలు కట్టడం అని ఇంకొందరు అంటూ ఉంటారు. వీటన్నిటితో పాటుగా పెళ్లి వేడుకలు మొదటగా రోలు రోకలిని పూజించి పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉంటారు.

అయితే ఈ పద్ధతిని ఈ ఆచారాన్ని సంప్రదాయానికి కేవలం అతి కొద్దిమంది మాత్రమే పాటిస్తున్నారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టి పాడేస్తూ ఉంటారు. కానీ పెళ్లి వేడుకలు రోలి రోకలిని ఎందుకు పూజిస్తారు?వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మనిషి జీవితంలో ముడివడి ఉన్నవి. ధాన్యం, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు ఇలా అనేక రకాల ధాన్యాలను మొదట దంచి వంటకు అనువుగా చేసుకొని అన్నం వండుకుంటారు.

 

ఇక కందులు, పెసలు, శనగలు, మినుములు తిరుగలి తో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతర రకాల పిండి వంటలు చేసుకుంటారు. మనిషి తినాలి అంటే రోలు, రోకలి, తిరుగలి, రుబ్బురాయి ఇవి తప్పనిసరి. ఇప్పుడంటే టెక్నాలజీ పారిపోయి ఎన్నో రకాల మిషన్లు వచ్చేసాయి. అయితే ఈ రోలు రోకలి తిరగలిని వాటిని ఎక్కడో మారుమూల మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఉదయాన్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు పసుపు కొట్టుకోవటం ఇవన్నీ నిత్యకృత్యములు. అప్పట్లో పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి కొట్టుకోవటం ఇలాంటి వన్నీ కూడా కుటుంబం మొత్తం కలిసి చేసేవారు.

 

ఇపుడు యాంత్రిక యుగం రావడంతో అన్నిటికీ యంత్రాలే. అన్నీ రెడీమేడ్‌గా షాపులో దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు అన్ని కూడా రెడీమేట్. శుభకార్యాలలో మన సాంప్రదాయాన్ని గుర్తుచేయటం కోసం ఈ విధంగా రోలు రోకలిని పూజిస్తారు. మీరు తినండి, పదిమందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తాము. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. నాగలితో భూమిని దున్ని పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అన్ని చెప్పిన బల రాముడు నిజమైన రైతుకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి, దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు, రోకలి, తిరగలిని పూజించడంలోని అంతరార్థం.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -