Ayalaan: తెలుగు రాష్ట్రాల్లో అయలాన్ షోలు క్యాన్సిల్ కావడానికి రీజన్ ఇదేనా?

Ayalaan: మామూలుగా పండుగ సమయాలలో ఏవైనా స్పెషల్ డేస్ లో సినిమాలు విడుదల అవ్వడం అన్నది కామన్. అందులో భాగంగానే నేడు రిపబ్లిక్ డే కారణంగా రెండు సరికొత్త సినిమాలు విడుదల అయ్యాయి. ఒకటి కెప్టెన్ మిల్లర్ సినిమా కదా మరొకటి శివ కార్తికేయ నటించిన అయలాన్. సైన్స్ ఫిక్ష‌న్ జోన‌ర్‌లో త‌యారైన ఈ సినిమా గ‌త‌వారంలోనే త‌మిళ‌నాట విడుద‌లైంది. ఈరోజు టాలీవుడ్ లోకి అడుగుపెట్టాలి. అయితే కొన్ని అనివార్య కార‌ణాల‌ వల్ల అయ‌లాన్ షోస్ అన్నీ ర‌ద్ద‌వుతున్నాయి. ఉద‌యం 10 గంట‌ల ఆట‌ల‌కు టికెట్లు అమ్మిన త‌ర‌వాత థియేట‌ర్ యాజ‌మాన్యం సారీ చెప్పి, డ‌బ్బులు వాప‌స్ చేసింది.

 

మార్నింగ్ షో, మాట్నీ ఆట‌లూ ర‌ద్దవుతున్నాయి. శివ‌కార్తికేయ‌న్ సినిమా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింద‌ని, అందుకే షోలు ర‌ద్దువుతున్నాయ‌ని తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఈ స‌మ‌స్య‌ని క్లియ‌ర్ చేసుకొని, రిలీజ్ కి క్లియ‌రెన్స్ తెచ్చుకోవాల‌ని తెలుగు నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. రిప‌బ్లిక్ డే సెల‌వుని క్యాష్ చేసుకోవాల‌న్న అల‌యాన్ మూవీ మేకర్స్ ప్ర‌య‌త్నం కాస్త బెడ‌సికొట్టింది. ఇదే రోజు విడుద‌ల అవుతున్న కెప్టెన్ మిల్ల‌ర్‌కు ఇది ప్ల‌స్ కానుంది. ధ‌నుష్‌కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. పోటీకి రావాల్సిన సినిమా ఆగిపోయింది. దాంతో ధ‌నుష్ సినిమానే ఏకైక ఆప్ష‌న్ గా మిగిలింది. దీంతో ధనుష్ సినిమా ఎక్కువ థియేటర్లలో ప్రదర్శితం అవుతూ దూసుకుపోతోంది.

కానీ శివ కార్తికేయన్ మూవీకి ఊహించని విధంగా షాక్ ఎదురవడంతో చిత్ర బృందం ఆలోచనలో పడ్డారు.. ఆయన అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఏలియన్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ మూవీ ని చూడడానికి చాలామంది ఆతృతగా ఎదురు చూస్తుండగా ఇంతలోనే ఇలా జరిగింది. మరి వీలైనంత తొందరగా సమస్యను క్లియర్ చేసుకుని ఈ సినిమాను తీయడం ప్రదర్శితం అయ్యేలా చేస్తారో లేదో చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -