Vijay Devarakonda: స్ట్రెస్ కలిగితే ఆ వీడియోలు చూస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్!

Vijay Devarakonda: శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ప్రిన్స్. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ పాల్గొని సందడి చేశారు.

ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండ వేదికపై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసే సమయంలో మా డైరెక్టర్ అనుదీప్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ పెట్టుకొని ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. ఆయన షార్ట్ ఫిలిమ్స్ అప్పట్లో అంతా అద్భుతంగా ఉండేవి ఇక దర్శకుడుగా మారిన తర్వాత జాతి రత్నాలు వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అక్టోబర్ 21వ తేదీ మరో బ్లాక్ బస్టర్ రాబోతుంది అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి వెల్లడించారు.ఇకపోతే ఇప్పటికీ నాకు పని ఒత్తిడి కారణంగా స్ట్రెస్ ఫీల్ అవుతే తప్పకుండా అనుదీప్ వీడియోలు పెట్టుకుని చూస్తానని ఆ వీడియోలు తనకి ఎంతగానో నచ్చుతాయని విజయ్ వెల్లడించారు.ఇక హీరో శివ కార్తికేయన్ గురించి మాట్లాడుతూ తాను ఎప్పటినుంచో శివ కార్తికేయన్ ను కలవాలని కోరుకుంటున్నాను. అయితే ఇలా ఈ సినిమా ద్వారా అతనిని కలిసే అవకాశం లభించిందని తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తాను తమన్,హరీష్ శంకర్ తో కలిసే నటించలేదు. త్వరలోనే వీరితో కలిసి నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన నటిస్తున్నటువంటి నటి మారియా గురించి మాట్లాడుతూ భారత చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రస్తుతం తన దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులలో ఈ సినిమాకు మధురానుభూతులు పంచుతాయని, ఆనందాన్ని కలుగజేస్తుందని నమ్ముతున్నానని విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈ కార్యక్రమం సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -