Shiva Karthikeyan: శివ కార్తీకేయన్ హీరోయిన్ గొప్ప మనసు.. తన రెమ్యునరేషన్‌తో..?

Shiva Karthikeyan: జాతీరత్నాలు ఫేమ్, యువ టాలెంటెడ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించిన సినిమా ‘ప్రిన్స్’. ఈ సినిమాలో హీరోగా శివ కార్తీకేయన్, హీరోయిన్‌గా మారియా ర్యాబోషప్క నటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు స్టార్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు హరీశ్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో శివ కార్తీకేయ సభను ఉద్దేశించి మాట్లాడాడు.

ఈ సందర్భంగా శివ కార్తీకేయ మాట్లాడుతూ..‘అందరికీ నమస్కారం.. ముందుగా మనం ఈ రోజు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకోవాలి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్మార్టెస్ట్ యాక్టర్ విజయ్. సోషల్ మీడియాలో నేనూ కూడా అతడికి ఫాలొవర్‌ని. తన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ చూస్తుంటాను. విజయ్ నటించిన గీతా గోవిందం సినిమాను నేను చాలా సార్లు చూశాను. ఈ సినిమాలో విజయ్ యాక్టింగ్ సూపర్‌గా ఉంటుంది. అలాగే విజయ్ కూడా ఎంతో క్యూట్‌గా, స్వీట్‌గా కనిపిస్తాడు. విజయ్‌ను డైరెక్ట్‌ గా కలిసినప్పుడు సినిమాలో కంటే బయటే ఎక్కువ స్వీట్‌గా కనిపించాడు.’ అని తెలిపారు.

సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 15 ఏళ్లు దాటిందని హీరో శివకార్తీకేయ అన్నారు. కానీ విజయ్ దేవరకొండ కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో ఒడిదొడుకులు ఎదుర్కున్నప్పటికీ ఇప్పుడు రాకెట్‌లా దూసుకెళ్తున్నాడన్నారు. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడన్నారు. విజయ్ దేవరకొండను చూస్తే ‘ప్రిన్స్’లా కనిపిస్తాడని కార్తీకేయన్ తెలిపారు. ప్రిన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చినందుకు విజయదేవరకొండకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఇద్దరు కలిసి సినిమా చేద్దామా? అని విజయ్‌ని కార్తీకేయన్ అడిగారు.

అలాగే హీరోయిన్ మారియాతో పని చేయడం చాలా సంతోషంగా ఉందని శివకార్తీకేయన్ తెలిపారు. ప్రస్తుతం మారియా దేశంలో పరిస్థితులు బాగాలేవు. అయినా మారియా ఎంతో కమిట్‌మెంట్‌తో పని చేశారని కార్తీకేయన్ అన్నారు. ప్రిన్స్ సినిమా ఆఫర్ ఇచ్చినప్పుడు ఆమె ఒక మాట చెప్పారని, సినిమాలో ఆమెకు ఇచ్చే రెమ్యునరేషన్‌ను తమ దేశంలోని యుద్ధ బాధితులకు ఇస్తానని ఆమె చెప్పారని కార్తీకేయన్ పేర్కొన్నారు. అలాంటి మంచి మనసును కలిగి ఉన్న హీరోయిన్‌తో కలిసి నటించడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -