Coins: కొలను నదుల్లో నాణేలు వేయడానికి గల కారణం ఇదే?

Coins: సాధారణంగా మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడ స్వామివారికి నగదు వస్తురూపంలో కానుకలు సమర్పించడంతోపాటు అక్కడే ఉన్న కోనేటిలో నదులలో స్నానాలు చేసి అక్కడ కాయిన్స్ ని వేస్తూ ఉంటాము. కొలనులు, కోనేరులు, నదులలో కాయిన్స్ వేయమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకు అని ప్రశ్నిస్తే కోరికలు నెరవేడుతాయని మంచిదని చెబుతూ ఉంటారు.. భారతదేశంలో నదులను పూజించే సంస్కృతి ఉంది. అందుకే ఏదైనా నది కనిపించినప్పుడు అందులో నాణేలను వేస్తూ ఉంటారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలు అయినా గోదావరి,కృష్ణ, కావేరి పెన్నా నది, తుంగభద్రా నది ఇతర నదులలో నాణేలను వేస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద నదుల్లో గంగా నది కూడా ఒకటి. ఈ నదుల వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. నాణేలు ఎందుకు వేస్తారు అన్న విషయానికొస్తే..

దైవ దర్శనానికి వెళ్లినపుడు భక్తులు అత్యంత నిష్టగా ఇంటి వద్ద స్నానం ఆచరించి వెళ్తుంటారు. అలా టెంపుల్ లేదా పుణ్యక్షేత్రానికి వెళ్లినపుడు ఆ క్షేత్రంలోని కోనేరు లేదా నది లేదా సరస్సులో మళ్లీ స్నానం చేస్తారు. అదే సమయంలో నది లేదా కొలనులో దీపాలను వదిలి నాణేలను వేస్తుంటారు. అప్పట్లో రాగి నాణేలు ఉండేవి.

 

వాటిని నీటిలో వేయడం ద్వారా నీరు శుభ్రం అవడంతో పాటు స్వచ్ఛంగా మారుతుందని భక్తుల నమ్మకం. రాగి నాణేలకు వాటర్‌ను శుభ్రపరిచే గుణాలు ఉండటం వల్ల అలా నీటిలో నాణేలు వేస్తారు. అలా రాగి పాత్రలకు కాని రాగి నాణేలకు కాని నీటిని శుభ్రపరిచే శక్తి ఉందని శాస్త్రీయంగా నిరూపితమైంది. కానీ, కాలక్రమేణా రాగి నాణేలు కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఉన్న కాయిన్స్ రాగితో చేసినవి కాదు. ప్రవహించే నదిలో రాగి నాణేలు వేస్తే అవి ఇంకా శుభ్రమవుతాయనేది భక్తుల నమ్మకం. అప్పట్లోని ఆ నమ్మకాన్ని ఇప్పటికీ భక్తులు పాటిస్తుంటారు. పూర్వకాలం నుంచి వచ్చిన ఈ ఆచారం నేటికీ కొనసాగుతోంది. అయితే, ఇప్పడున్న నాణేలను నదుల్లో లేదా కొలనులో వేయడం వల్ల నదులు లేదా కొలనులు శుభ్రపడకపోగా పాడయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుటి నాణేలను కొలనులో వేయడం వల్ల కొద్ది రోజులకు అవి తుప్పు పడతాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -