Money Calculations Tips: డబ్బు లెక్కించేటప్పుడు చేయకూడని తప్పులు ఇవే

Money Calculations Tips: మనలో ఎవరికి మాత్రం డబ్బు అంటే ఇష్టం ఉండదు. డబ్బు ఉంటే అన్నీ మన సొంతం అవుతాయనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ డబ్బు మనం ఎంత సంపాదించినా అది మన దగ్గర నిలవాలి. అంటే మనం ఎంత సంపాదించినా, అంతా ఖర్చైపోతే అది ఖచ్చితంగా మంచిది కాదు.

ప్రతి ఆపదలో మనల్ని ఆదుకునేది డబ్బు. అందుకే డబ్బు విషయంలో ప్రతీది ఎంతో ముఖ్యమని పెద్దలు చెబుతుంటారు. అయితే మనలో చాలామంది డబ్బును లెక్కించే సమయంలో చేసే ఒక తప్పు వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించదట. ఈ తప్పును చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని, దాని వల్ల ఆర్థిక కష్టాలు మొదలవుతాయని పెద్దలు చెబుతుంటారు.

మనలో చాలామందికి డబ్బును లెక్కించేటప్పుడు, నోట్లకు ఉమ్ము అంటించే అలవాటు ఉంటుంది. డబ్బు లెక్కించే సమయంలో నోట్లను విడదీయడానికి నాలుక మీద ఉమ్మును వాడుతుంటాం. ఈ తప్పును అస్సలు చేయకూడదట. దీని వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, దాని వల్ల ఆర్థిక కష్టాలు వస్తాయట.

ఇలా ఉమ్మిని వాడే బదులుగా తడిగా వేరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించడం మంచిదట. అలాగే నోట్లను కానీ నాణేలను కానీ విసరకూడదట. ఇలా చేయడం అంటే లక్ష్మీదేవిని అవమానించడమే అవుతుందట. దీంతో లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉండదట. ఫలితంగా డబ్బు నిల్వక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయట. అలాగే డబ్బును దాచేటప్పుడు కూడా శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే డబ్బును దాచాలట.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -