CM YS Jagan: మూడు రాజధానులపై జగన్ కీలక వ్యాఖ్యలు.. జాతీయ మీడియా ఇంటర్వ్యూపై జోరుగా చర్చ

CM YS Jagan: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడు రాజధానుల అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మా రాయి. సీఎం, మంత్రులు ఎక్కడైతే ఉంటారో అక్కడ నుంచే పరిపాలన సాగుతుందని, సీఎం, మంత్రులు ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం ఉంటుందని జగన్ తెలిపారు. అమరావతిపై తనకు ఎలాంటి కోపం లేదని, ఒకవేళ అమరావతిపై తనకు కోపం ఉందని అక్కడ శాసన రాజధాని ఎందుకు పెడతానంటూ జగన్ చెప్పుకొచ్చారు. అమరావతిని ప్రజారాజధానిగా చంద్రబాబు చేయలేకపోయారని, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని జగన్ విమర్శించారు.

రాజధాని ప్రకటించకముందే టీడీపీ నేతలు భూములు కొన్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగిందని జగన్ ఆరోపించారు. టీడీపీ నేతలు అమరావతి కోసం చేస్తున్న ఆందోళన తమ రియల్ ఎస్టేట్ భూముల కోసమేనంటూ జగన్ విమర్శించారు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి సీఎం జగన్ విశాఖకు రాజధానిని తరలించనున్నారని, అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తారనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైసీపీ నేతలు, మంత్రులు కూడా ఇదే చెబుతున్నారు. త్వరలోనే విశాఖకు రాజధానిని తరలిస్తారని మీడియాకు ప్రకటన ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చనీయాంశంగా మారింది.

అమరావతిలో ఎలాంటి సదుపాయాలు లేవని, అక్కడ రాజధాని నిర్మించాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని తెలిపారు. విశాఖలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే అద్భుతమైన రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చంటూ జగన్ తెలిపారు. రాజధానికి కావాల్సిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని, తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేయవచ్చని జగన్ తెలిపారు. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటం వల్లనే రాజధానిగా విశాఖను ఎంచుకున్నట్లు జగన్ చెప్పారు. సీఎం పరిపాలన ఎక్కడ నుంచి చేస్తే ఏంటీ అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా పరిపాలన చేసే అధికారం సీఎంకు ఉందని, ఎక్కడ నుంచే ఏమవుతుందని జగన్ ప్రశ్నించారు.

పరిపాలన స్వేచ్చగా చేసుకునే హక్కు కూడా సీఎంకు లేదా అంటూ జగన్ ప్రశ్నించారు. సీఎం ఎక్కడ నుంచి పరిపాలన కొనసాగించారో కూడా ఎవరెవరో నిర్ణయిస్తారా అంటూ నిలదీశారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అందుకే విశాఖను కార్వనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసినట్లు జగన్ చెప్పారు.

కాగా ఏపీలో మూడు రాజధానులపై వైసీసీ సర్కార్ ఉద్యమం చేపట్టింది. మూడు రాజధానులుగా మద్దతుగా వైజాగ్ వేదికగా ఉద్యమానికి తెరలేపిన వైసీపీ.. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించింది. రాయలసీమలో కూడా మూడు రాజధానుల ఉద్యమాన్ని తీసుకొచ్చింది. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానులుగా మద్దతుగా వైసీపీ ఉద్యమం చేపట్టింది. ఇక త్వరలో విజయవాడలో కూడా మూడు రాజధానులుకు మద్దతుగా ఉద్యమం చేపట్టే ఆలోచనలో వైసీపీ ఉందని. త్వరలో విజయవాడలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో బీజేపీ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రాజధానులుగా మద్దతుగా వైసీపీ ర్యాలీలు నిర్వహించడం, త్వరలోనే విశాఖకు రాజధానిని మార్చే ఉద్దేశంతో వైసీపీ సర్కార్ ఉన్న నేపథ్యంలో జగన్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -