Pothina Mahesh: పవన్ పై సంచలన ఆరోపణలు చేసిన పోతిన మహేష్.. జనసేన రియాక్షన్ ఇదే!

Pothina Mahesh: జనసేన పార్టీని పోతిన మహేష్ వీడారు. అంతేకాదు.. పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ జనసేన నుంచి బయటకు వచ్చారు. విజయవాడ వెస్ట్ సీటును ఆయన ఆశించారు. కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ బీజేపీకి వెళ్లింది. బీజేపీ మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరిని అక్కడ నుంచి పోటీలో దింపింది. దీంతో… పోతిన మహేష్ జనసేనను వీడారు. జనసేన 21 సీట్లకు గాను 18 సీట్లు ప్రకటించినపుడు అందులో విజయవాడ వెస్ట్ లేదు. విజయవాడ వెస్ట్‌ను పెండింగ్‌లో ఉంచడంతో ఆయనకు అనుమానాలు మొదలైయ్యాయి. దీంతో అప్పుడే ఆయన ఏకంగా నిరాహర దీక్షకు దిగారు. తనకు సీటు కేటాయించాలంటూ… విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని జనసేన కార్యాలయంలో తన అనుచరులతో కలిసి దీక్ష చేశారు. తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని అంతకుముందు ప్రకటించారు. పవన్ ఫోటో పెట్టుకొని ఇండిపెండెట్ గా పోటీ చేస్తానని అన్నారు. విజయవాడ వెస్ట్ బీజేపీకి కన్ఫామ్ అయ్యిన తర్వాత ఆయన కాస్త సైలంట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా పార్టీని వీడి వైసీపీలో చేరుతారని చర్చ నడుస్తోంది.

ఇదంతా పక్కన పెడితే ఆయన చేసిన కామెంట్స్ కాస్త హాస్యాస్పదంగా మారిపోయాయి. నమ్మినపార్టీ వచ్చించిందని అన్నారు. టికెట్ రాలేదు కనుక బాధలో ఉన్నారు అనుకోవచ్చు. ఆస్తులు అమ్ముకొని కష్టపడితే అవమానాలకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వరకూ టికెట్ వస్తుందని భావించిన తర్వాత టికెట్ రాకపోతే ఆ మాత్రం బాధ ఉంటుంది. పార్టీ విదేయుడుగా ఉంటే నమ్మకద్రోహం చేస్తారా? బీసీలే త్యాగం చేయాలా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎవరైనా సామాజిక వర్గం కార్డును వాడుతారు. కాబట్టి మహేష్ కూడా టికెట్ రాకపోయేసరికి కులం కార్డును వాడేశారు. పార్టీ కోసం అహర్నిసలు కష్టపడితే అన్యాయం చేశారని అన్నారు. దీనికి జనసేన నేత కిరణ్ రాయల్ కౌంటర్ వేశారు. జనసేనలో చేరిన తర్వాత మహేష్ కు ఎంతక్రేజ్ పెరిగిందో తెలుసుకోవాలన్నారు. అంతకుముందు ఆయన్ని ఎవరూ గుర్తు పట్టేవారు కాదని అన్నారు. ఇప్పుడు పార్టీ ద్వారా ఆయనకు ఓ గుర్తింపు లభించిందని చెప్పారు. సామాజిక వర్గాల వారిగా పార్టీలో అన్యాయం జరుగుతోందని మహేష్ ఆరోపించారు. దానికి బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాజిక వర్గాల వారీగా అన్యాయం జరిగితే ఇంతవరకూ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అక్కడితో ఆగకుండా జనసేన నేతల అవినీతి బయటపెడతానని బాంబ్ పేల్చే ప్రయత్నం చేశారు. జనసేన నేతల అవినీతి గురించి చెప్పడానికి.. ఆ పార్టీ ఏమైన అధికారంలో ఉందా? పైగా అవినీతి జరుగుతుంటే మహేష్ ఎందుకు మౌనంగా ఉన్నారు? టికెట్ దక్కకపోయేసరికి పార్టీలో అవినీతి గుర్తు వచ్చిందా? ఇదంతా పక్కన పెడితే.. విజయవాడ వెస్ట్ టికెట్ సుజనాచౌదరికి కేటాయించిన తర్వాత కొన్ని రోజుల పాటు సైలంట్ గా ఉన్నారు. అప్పుడే అందరికి అనుమానం వచ్చింది. టికెట్ కేటాయించకముందు నిరసనలు చేసిన మహేష్ టికెట్ కేటాయింపు తర్వాత ఎందుకు సైలంట్ అయ్యారు? ఇన్నాళ్లు పార్టీ కోసం పెట్టిన డబ్బు సుజనా చౌదరి తనకు ఇస్తే సహకరిస్తానని డిమాండ్ చేప్పినట్టు తెలుస్తోంది. అందుకే మొదల్లో పోతిన మహేష్ తో ఉన్నంత మంది నాయకులు ఇప్పుడు లేరు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -