Janhvi Kapoor: సినిమాలు ప్రొఫెషనల్.. సరదాకి సోషల్ మీడియా.. అందుకే అలా కనిపిస్తా: జాన్వీ

Janhvi Kapoor: బాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తోంది. ప్రముఖ నటి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వీకపూర్. తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ, క్రేజ్‌ను సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘మిలి (Mili)’ సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్ల ముందుకు వచ్చింది. మంచి టాక్‌తోనే సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే తాజాగా సినిమా సక్సెస్ మీట్‌లో జాన్వీ కపూర్ పాల్గొంది. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందించింది. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పై రిపోర్టర్ ప్రశ్నించారు.

 

 

‘సినిమాలో మీరు చేసే పాత్రలు ఒకలా ఉంటాయి. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు ఒకలా ఉంటాయి. దేనికి సంబంధం ఉండదు. సోషల్ మీడియాలో మోడ్రన్‌గా చూసే ప్రేక్షకులు.. సినిమాల్లో మాత్రం మిమ్మల్నీ సంప్రదాయ, సాధారణ అమ్మాయి పాత్రలో చూడాల్సి ఉంటుంది. ఆ పాత్రల్లో మిమ్మల్నీ చూడటానికి ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. దానికి మీ సమాధానమేంటి’ అని రిపోర్టర్ ప్రశ్నించారు.

 

 

ఈ విషయంపై జాన్వీ స్పందిస్తూ.. ‘ఇలాంటి మాటలు నేను చాలానే వింటున్నాను. కానీ ఎవరి ఎక్స్ పర్టేషన్‌కు అందకుండా నా ఆలోచనలు ఉండాలని కోరుకుంటాను. అందుకు ప్రతిరోజూ కొత్తగా ప్రయత్నిస్తుంటాను. ఓ వైపు నన్ను మోడ్రన్‌గా చూసి.. మరోవైపు సినిమాల్లో కుర్తా ధరించుకున్న నన్ను చూడటానికి ఇష్టపడకపోవచ్చు. కానీ అది నా ప్రొఫెషనల్ లైఫ్. నా నటనను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ నా పర్సనల్ లైఫ్‌లో అలా ఉండాలని అనుకోను. సోషల్ మీడియాలో క్యూట్‌గా కనిపిస్తే నలుగురు నా ఫోటోకి లైక్ కొడతారు. దాని వల్ల నాకు కొత్తగా మరో బ్రాండ్ అడ్వర్‌టైజ్‌మెంట్‌కు ఆఫర్ వస్తుంది. దాంతో నేను సులభంగా ఈఎంఐలు కట్టుకోగలుగుతా.’ అని సమాధానమిచ్చారు. కాగా, ప్రస్తుతం జాన్వీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ, భేడియా’ సినిమాల్లో నటిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -