Janhvi Kapoor: అది లేదని తెలుగు హీరో సినిమాని రిజెక్ట్ చేసిన జాన్వీ.. అసలేం జరిగిందంటే?

Janhvi Kapoor: అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈమె బాలీవుడ్ కి చెందిన హీరోయిన్ అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కాగా మొదట దడక్ సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే జాన్వీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఆ వార్త ఏమిటంటే.. జాన్వి కపూర్ తెలుగు హీరో సినిమాను రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగులో డెబ్యూ ఇవ్వబోతున్న జాన్వి కపూర్ అంతకుముందే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించాల్సి ఉండింది. అయితే బోనీ కపూర్ ఈ సినిమాను వద్దు అని చెప్పడంతో రిజెక్ట్ చేసేసింది. జాన్వి కపూర్ ఎన్టీఆర్ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేయబోతోంది. ఇలాంటి క్రమంలోనే మరికొన్ని సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే జాన్వి కపూర్ మాత్రం ఎన్టీఆర్ లాంటి స్థాయి ఉన్న హీరోతోనే నటించడానికి ఇష్టపడుతోందట.

అయితే అంత పెద్ద హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు. రీసెంట్ గా యంగ్ హీరో సినిమాలో జాన్వికపూర్ కి ఛాన్స్ వచ్చిందట. పెద్ద హీరో కాదు కానీ నార్మల్ హీరో ఆయన చేసిన ప్రతి సినిమా ఆవరేజ్ గా నిలుస్తుంది. నటన పరంగా సూపర్. ఆ హీరో సినిమాలో అవకాశమొస్తే జాన్వి కపూర్ రిజెక్ట్ చేసిందట. దానికి కారణం ఆ హీరోకి పెద్దగా పేరు పలుకుబడి లేకపోవడమే. జనాలలో మంచి నటుడు అని పేరు సంపాదించుకున్న ఈ హీరో కి ఎన్టీఆర్,చరణ్, మహేష్ బాబు అంత స్టేటస్ లేదు . ఆ కారణంగానే జాన్వికపూర్ రిజెక్ట్ చేసిందట..

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -