Ram Charan: రామ్ చరణ్ కు జోడీగా యాక్ట్ చేయడానికి ఆ హీరోయిన్ ఓకే చెబుతుందా?

Ram Charan: అతిలోకసుందరి కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తర్వాత తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో టాలీవుడ్ లో మొదటి అడుగు వేసింది జాన్వీకపూర్. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ అమ్మడికి అదృష్టం కలిసి వచ్చి మరొక బంపర్ ఆఫర్ తగిలింది.

 

అదేమిటంటే బుచ్చిబాబు సనా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి ఆర్ సి 16 వర్కింగ్ టైటిల్ గా వస్తున్న మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది జాన్వీ. ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలిసి నిర్మించనున్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందిస్తారు. దేవర సినిమా షూటింగ్ పూర్తికాకముందే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులో జాన్వీ కి ఛాన్స్ వచ్చిందంటే నిజంగా ఆమె నక్క తోక తొక్కినట్లే.

బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు బడా స్టార్స్ పక్కన నటించినట్లు అవుతుంది. ఈ రెండు చిత్రాల్లో ఒక్క సినిమా విజయం సాధించిన జాన్వీ కెరియర్ గాడిన పడిపోతుంది. స్టార్ హీరోయిన్ ముద్ర జాన్వి పై పడుతుంది. అయితే ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు ఈ చిత్రంలో సమంత కూడా నటించబోతున్న సూచనలు ఉన్నాయి అంటున్నారు. ఒక కీలక పాత్ర కోసం సమంత ను సంప్రదించారట.

 

ప్రస్తుతానికి ఇవన్నీ ఊహగానాలు మాత్రమే, నిజం ఏమిటనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామాఅంట,రామ్ చరణ్ రోల్ ఊర మాస్ గా ఉంటుందట. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చార్జర్ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ అవునా కాదా అనే విషయాన్ని మూవీ టీం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -