Khammam: ఈ పిల్లాడి కష్టం పగోడికి కూడా రాకూడదు.. అయ్యో పాపమంటూ?

Khammam: నవమాసాలు మోసి కనిపించిన తల్లి పిల్లలకు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణాతీతం. కేవలం కుటుంబ కలహాల కారణంగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తల్లిదండ్రులు క్షణికావేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయం వల్ల పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇలా ఎంతోమంది పిల్లలు అనాధలుగా మారిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

ఖమ్మం జిల్లాలో బస్ కండక్టర్ గా పని చేస్తున్నటువంటి రాంబాబు కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య దేవమణితో తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఇలా ఎన్నోసార్లు గొడవ పడినటువంటి వీరిద్దరి మధ్య కలహాలు పెరుగుతూ వచ్చాయి.తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకోవడంతో రాంబాబు రోకలితో దేవమనిని కొట్టడంతో ఒక్కసారిగా ఆమె మరణించారు. అయితే వీరి కుమారుడు ప్రవీణ్ తేజ్ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతూ హాస్టల్ లో ఉంటున్నారు.

ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతుండగా తన తల్లి మరణ వార్త తెలిస్తే తన పరీక్షకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా కుటుంబ సభ్యులు తన కుమారుడికి ఈ విషయాన్ని తెలియజేయలేదు. అయితే పరీక్ష రాసి ఎంతో సంతోషంగా పరీక్ష బాగా రాసానని బయటకు వచ్చినటువంటి ప్రవీణ్ తేజ్ బయట తన తల్లి స్నేహితురాలు కనిపించడంతో పరీక్ష బాగా రాసానని సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా అబ్బాయి సంతోషం ఎక్కువ సమయం పాటు లేదు వెంటనే బంధువులు తన తల్లి చనిపోయిందని ప్రవీణ్ తేజ్ నుహాస్పిటల్ మార్చరి వద్దకు తీసుకెళ్లగా అక్కడ విగత జీవిగా పడి ఉన్నటువంటి తన తల్లిని చూసి ఒక్కసారిగా ప్రవీణ్ తేజ్ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇలా తన తల్లి మరణ వార్త జీర్ణించుకోలేనటువంటి ప్రవీణ్ తేజ్ ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తున్నటువంటి బంధువులు ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -