Khammam: 36 ఏళ్లుగా కొబ్బరి కాయతో నీటి జాడలు చెబుతున్న్ పూజారి.. నిజంగా గ్రేట్ అంటూ?

Khammam: పొలాల్లో బోరు పాయింట్ కనుక్కోవాలి అంటే చేతిలో కొబ్బరికాయను పొలం మొత్తం తిరుగుతూ ఆ కొబ్బరికాయ ఎక్కడైతే తిరగడం లేదంటే కిందపడిపోవడం జరుగుతుందో అక్కడ నీళ్లు ఉన్నాయని గుర్తించేవారు. పూర్వకాలం నుంచి ఇప్పటికి ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది. కొంతమంది కొబ్బరికాయతో చేస్తే మరి కొంతమంది నిండు చెంబు నీళ్లతో వేప పుల్లతో అగరబత్తితో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోరు పాయింట్లు చూపిస్తూ ఉంటారు. మహాశివుని జటాజూటం నుంచి పాతాళానికి ప్రవహించిన గంగాజలం ఛాయలు గుర్తించాలి అంటే మూడు కన్నులను పోలిన కొబ్బరి కాయ కావాల్సిందే.

కొబ్బరి కాయపై ఉండే మూడు రంధ్రాలు మూడు నేత్రాలుగా భావిస్తారు. అలాంటి కొబ్బరి కాయలతో ఆధ్యాత్మిక ఆత్మ శుద్ధితో భూమిలోని గంగాజలం ఎక్కడ ఉందో గుర్తిస్తారు. నేటి కంప్యూటర్ యుగంలో కూడా భూమిలో జలపాతం గుర్తించి బోరు బావులు వేయాలంటే శాస్త్రం ప్రకారం ఆనాటి నుంచి కొబ్బరి కాయతో నీళ్ళ జాడ తెలుసుకునేందుకు కొందరు ఒక విద్యగా గురువులు నుంచి నేర్చుకుంటున్నారు. అలా 40 ఏళ్ల క్రితం నేర్చుకున్న ఆ విద్యనే ఈ రోజుకు కూడా పంట పొలాలకు, ఇండ్లలో తాగు, సాగు నీరు కావాలంటే కొబ్బరి కాయ విద్య తెలిసి ఉండాల్సిందే మరి. కొబ్బరి కాయలతో బోరు బావులుకు పాయింట్ పెడుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అతను ఎక్కడ ఉంటాడు అన్న వివరాల్లోకి వెళితే…ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన యార్లగడ్డ దయనంద స్వామి అనే ఒక పూజారి 38 ఏళ్లుగా అమ్మవారు ఆలయంలో పూజలు చేస్తూ అమ్మవారిని ఆవాహనం చేసుకుని తనకు వచ్చిన పాత కాలపు విద్యతో చుట్టూ పక్కన గ్రామాలలో 40 బోర్లకు పాయింట్లు వేశారు.

ముందుగా తన ఆరేళ్ల వయసులో ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ బ్రహ్మానంద యోగి వద్ద నిష్ఠతో ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకున్నాడు. ఆనాటి నుంచి తన గ్రామాల చుట్టుపక్కల బోరులకు నీళ్ళు పడాలంటే కొబ్బరి కాయ విద్యతో నీళ్ళ జాడ గుర్తించి బోరు బావులు పాయింట్ మార్కింగ్ వేస్తాడు. ముందుగా రెండు కొబ్బరి కాయలు చేతిలోకి తీసుకుని మహా శివుణ్ణి ఆరాధిస్తస్తూ గంగమ్మకు నమస్కరించి ఆత్మ శుద్ధితో కొబ్బరి కాయను అర చేతిలో ఉంచి నేలపై నీటి జాడకోసం తిరుగుతాడు. భూమి లోపల నీళ్ళ ఆనవాళ్లు ఉన్న చోట చేతిలోని కొబ్బరి కాయ పైకి నిలబడుతుంది. దీని ఆధారంగా నంద స్వామి ఆ ప్రాంతంలో బోరు వేసేందుకు మార్కింగ్ చేస్తాడు. తాను పెట్టిన బోరు పాయింట్ లో ఎంత మేరకు జలపాతం ఉంటుందో తెలుసుకునేందుకు తాను మరో కొబ్బరి కాయ పై అరికాళ్ళు నేలకు తాక కుండా కూర్చుంటాడు. తన తలపై చెయ్యి తో తాకిన వ్యక్తి మార్కింగ్ చేసిన మరో కొబ్బరి కాయ వద్దకు వెళ్ళినప్పుడు కొబ్బరి కాయ పై కూర్చున్న వ్యక్తి ఎంత ఫోర్స్ గా గిర్రు న తిరిగితే అంత ఎక్కువగా జలం ఉన్నట్టుగా గ్రహిస్తారు. అయితే ఇప్పటివరకు అతను చూపించిన ఎన్నో ప్రదేశాలలో నీరు పాడినట్లు అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -