Khammam: సంతోషంగా సాగుతున్న దాంపత్య జీవితంలో ఊహించని విషాదం..?

Khammam: దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో మరణిస్తూనే ఉన్నారు. కొందరు అనారోగ్యం కారణంగా మరణిస్తే కొందరు అత్యాచారాల కారణంగా మరణిస్తున్నారు. కొందరు హత్యలు ఆత్మహత్యలు ఇలా ఎన్నో రకాల కారణాలతో మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక వివాహిత మరణం కూడా ఆ కుటుంబాన్ని కలచివేసింది. భర్త పిల్లలతో కలిసి ఎటువంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతున్న ఆమె జీవితం ఊహించని విధంగా ముక్కు రూపంలో వచ్చి ఆమె వారి జీవితాలలో తీరని విషాదం నింపింది. అసలేం జరిగిందంటే.

 

ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో చెందిన పుట్టకోటకు చెందిన సత్తి వెంకటలక్ష్మికి కొన్నాళ్ల క్రితం ముత్తయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కూడా జన్మించారు. ఇక భర్త పిల్లలు ఎంతో సంతోషంగా గడుపుతోంది వెంకటలక్ష్మి. ఈ క్రమంలో కొన్నాళ్ల నుంచి వెంకటలక్ష్మి ముక్కులో నొప్పి వస్తుందని జనవరి 6న ఖమ్మం జిల్లాలో ఉన్న ఈఎన్‌టీ విభాగంలో వైద్యుడిని సంప్రదించారు. ఇక పరీక్షల అనంతరం వెంకటలక్ష్మికి.. డీఎన్‌ఎస్‌ సమస్య ఉందని గుర్తించి ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. ఈ క్రమంలో మంగళవారం ఆమెకు శస్త్రచికిత్స చేశారు.

 

అయితే సర్జరీ చేస్తున్న సమయంలో వెంకటలక్ష్మికి హఠాత్తుగా ఆయాసం వచ్చింది. కంట్రోల్‌ చేసే లోపే ఆమె మృతి చెందింది. అయితే వెంకటలక్ష్మి మృతికి వైద్యులే కారణమని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వెంకటలక్ష్మి మరణించింది అని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెకు గతంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని ముక్కుకి ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన కూతురు వెంకటలక్ష్మి మరణించింది అని తల్లి విజయ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి వద్ద బైటాయించి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆందోళన చేశారు. అంతేకాకుండా ఐసీయూ విభాగంలో ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు. వెంకటలక్ష్మికి వైద్యం చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరి ఆందోళనపై స్పందించిన వైద్య సిబ్బంది ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యలుపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. అలానే వెంకటలక్ష్మి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -