Naga Shaurya: ట్రెడిషనల్ లుక్‎లో.. కాబోయే భార్యతో నాగశౌర్య భలే ఉన్నాడుగా!

Naga Shaurya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుల్లో నాగశౌర్య ఒకడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నాగశౌర్య.. హఠాత్తుగా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి జరగనుండగా.. తాజాగా వీళ్ల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి.

 

టాలీవుడ్ లోని యంగ్ హీరోల్లో మంచి గుర్తింపు సాధించిన నాగశౌర్య.. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. నవంబర్ 20న ఉదయం 11.25 నిమిషాలకు వీరి పెళ్లి జరనుంది. కొద్ది మంది అతిథులు సమక్షంలో వీరి వివాహా వేడుక జరగనుందని సమాచారం. నాగ శౌర్యది ప్రేమ వివాహామే అని స్పష్టమవుతున్నా.. వీళ్లు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు. అనూష శెట్టి బెంగళూరులో ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.

 

నాగశౌర్య పెళ్లి రేపు జరగబోతుండగా.. ఆయన ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. పెళ్లి కొడుకు చేసే కార్యక్రమంతో సహా పలు కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం కాగా.. నాగశౌర్య ఇంటి వద్ద సందడి నెలకొంది. కాబోయే భార్యతో నాగశౌర్య ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.

 

బ్లూ కలర్ కుర్తా, బ్లాక్ కలర్ పైజామా ధరించిన నాగశౌర్య.. పెళ్లి దుస్తుల్లో ఆనందంగా కనిపిస్తున్నాడు. తనకు కాబోయే భార్య అనూష శెట్టి.. గోధుమ రంగు డిజైనర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది. ఇద్దరూ ఈడు జోడు ఎంతో అందంగా ఉండగా.. వీరి పెళ్లి జీవితం ఎంతో ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -