Mangli: హనుమాన్ ఆలయాన్ని నిర్మించిన మంగ్లీ.. నువ్వు దేవతవి తల్లీ!

Mangli: సింగర్ మంగ్లీ.. జానపద పాటలు పాడి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. సినిమాల్లోనూ పాటలు పాడి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆమె పాడిన పాటలు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అయితే మంగ్లీ యాసాభాష చూడటానికి తెలంగాణను పోలీ ఉంటాయి. కానీ ఆమె తెలంగాణ ఆడబిడ్డ కాదు. కేవలం తెలంగాణ జానపద పాటలు మాత్రమే పాడుతుంది. మంగ్లీ స్వస్థలం.. ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని బాసినేపల్లి తండా. నిరుపేద కుటుంబానికి చెందిన మంగ్లీ.. ట్రస్ట్ సాయంతో చదువుకుని.. పాటలు పాడటం నేర్చుకుంది. తిరుపతిలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఎస్వీ విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లొమా కోర్సు పూర్తి చేసింది. సంగీతంలో మెళకువలు నేర్చుకుని కెరీర్ స్టార్ట్ చేసింది.

 

జానపద పాటలు పాడి కెరీర్ స్టార్ట్ చేసిన మంగ్లీ.. తీన్మార్ ప్రోగ్రామ్‌తో టీవీ ఛానెల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వీ6లో యాంకర్‌గా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మాటకారి మంగ్లీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మైక్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో సొంతంగా పాటలు పాడుతూ మరింతగా పాపులర్ అయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆమె పాడిన పాటలు రాష్ట్ర ప్రజలను ఎంతగానో అలరించాయి. అలా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. ముందుకు దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా’ సాంగ్ సెన్సెషనల్ అయిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌తో మంగ్లీ చెల్లెలు కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

అయితే మంగ్లీ.. వైసీపీ ప్రభుత్వం తరఫున కూడా పాటలు పాడింది. దాంతో ఆమె సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం టీటీడీకి చెందిన ‘శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్’కు సలహాదారుగా నియమించింది. ఇటీవలే ఆమె ఈ పదవికి బాధ్యతలు చేపట్టింది. మంగ్లీ మంచి హోదాకు ఎదగడంతో సొంత గ్రామానికి ఏమైనా చేయాలని అనుకుంది. ఈ క్రమంలో తండాలో హనుమాన్ ఆలయాన్ని తన సొంత ఖర్చులతో నిర్మించింది. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మంచి రాతితో తయారు చేయించింది. ఆలయ నిర్మాణం కూడా పూర్తయింది. కాగా, మంగ్లీ చేసిన పనికి.. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంజనేయ స్వామికి ప్రతీవారం పూజలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -