ASP Hanumanthu: ఈ అనంతపూర్ ఏఎస్పీ సక్సెస్ స్టోరీ వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

ASP Hanumanthu: సాధారణంగా కొందరు పుట్టుకతోనే ధనవంతులుగా పుడతారు. అలాంటి వారు కష్టపడకుండానే అన్ని సమకూరుతాయి. కానీ కొందరు మాత్రం జీవితంలో పైకి ఎదగడానికి ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే అలా కష్టపడి పనిచేసి జీవితంలో ఎదిగిన కొందరు ఇప్పుడు గొప్ప స్థాయికి వెళ్లి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో ఏఎస్పీ హనుమంతు కూడా ఒకరు.

ప్రస్తుతం ఈయన అనంతపురంలో జిల్లా ఏఎస్పీ గా భాద్యతలు నిర్వర్తిస్తు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజు ఏఎస్పీగా ప్రజలకు సేవలు అందిస్తున్న హనుమంతు గారికి సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పుడు భోజనం చేయటానికి గతి లేక భిక్షాటన చేశానంటూ అనుభవించిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.

 

అలా ఆహారం కోసం బిక్షాటన చేసే సమయంలో చదువుకునే పిల్లలను చూసి అన్నం తినడం మానేసి వాళ్లనే చూస్తూ ఉండిపోయానని ఆయన తెలిపారు. చదువు కోసం స్కూల్ కు వెళితే నా దుస్తులు సరిగ్గా లేకపోవడంతో అన్నం కోసం వచ్చానని అనుకున్నారని ఆయన వెల్లడించారు. చిరిగిన దుస్తులు ధరించి స్కూల్ కి వెళితే..పిల్లలు నన్ను పక్కన కూర్చోబెట్టుకోలేదని ఆయన తెలిపారు.

 

టీచర్ గట్టిగా మందలించి పిల్లలతో స్నేహం చేసేలా చేశాడని టీచర్ మంచి బట్టలు ఇచ్చాడని ఆయన చెప్పుకొచ్చాడు. డబ్బు సంపాదించడానికి సమాధి తవ్వడానికి కూడా వెళ్లానని , వీధుల వెంట తిరిగి పూవ్వులు కూడా అమ్మానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలా ఈ రోజు ఎస్పీగా ఈ స్థాయికి రావటానికి ఎన్నో కష్టాలు అనుభవించానని ఆయన తెలిపారు. ఆయన సక్సెస్ సాధించిన తీరు అందరికీ స్పూర్తిధాయకమని నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -