Ananthapur: పిల్లలున్నారు.. మమ్మల్ని బ్రతికించు.. ఈ కానిస్టేబుల్ మాటలు వింటే కన్నీళ్లు పెట్టాల్సిందే!

Ananthapur: తాజాగా అనంతపురంలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలీస్ దంపతుల ఆర్తనాదాలు ఒక అందరినీ కండతది పెట్టిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. ఈ హృదయ విదారక ఘటన బుధవారం అనంతపురం నగర సమీపంలో చోటు చేసుకుంది. ఆత్మకూరుకు చెందిన కిరణ్‌కుమార్‌ అనే 42 ఏళ్ళ వ్యక్తి 2003లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికై ఐదేళ్లు గ్రే హౌండ్స్‌లో పని చేశారు. 2014లో ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా కన్వర్షన్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు.

భార్య అనిత శింగనమల మండలం తరిమెల ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంటుగా పని చేస్తున్నారు. వారికి యశ్వంత్‌నారాయణ, మణిదీప్‌ కుమారులు ఉన్నారు. ఇటీవలే నగరంలోని కళ్యాణ దుర్గం రోడ్డులో ఉన్న ఎస్బీఐ కాలనీలో సొంత ఇళ్లు కట్టుకొని ఉంటున్నారు. కిరణ్‌కుమార్‌ రోజూ భార్యను ద్విచక్ర వాహనంలో సోమలదొడ్డి క్రాస్‌ వద్దకు తీసుకెళ్లి బస్సు ఎక్కించి వచ్చేవారు. రోజులాగే బుధవారం ఉదయం 7.30 గంటలకు భార్యతో కలిసి ఇంటి నుంచి బయలుదేరారు. నగర శివారులోని గోపాల్‌ దాబా సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో వారిపై నుంచి గుర్తుతెలియని వాహనం వేగంగా దూసుకెళ్లింది.

 

ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌ రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. భార్య తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలిస్తుండగా కిరణ్‌కుమార్‌ మృతిచెందారు. భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్న కానిస్టేబుల్‌ దంపతులను జనం గుమికూడి ఫొటోలు, వీడియోలు తీస్తూ చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ కూడా కాపాడటానికి ముందుకు రాలేదు. కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు.

 

అలాగే ఎవరూ దగ్గరికి కూడా రాలేదు. భార్యాభర్తలు ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అక్కడున్న జనం 108కి ఫోన్‌ చేసి అలా చూస్తూ ఉండిపోయారు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి వారిని ఆసుపత్రికి తరలించే వరకు కనీసం సపర్యలు చేస్తామన్నా మనసు రాకపోవడం సమ సమాజం సిగ్గుపడాల్సిన అంశం. అటు అధికారులు, తోటి ఉద్యోగుల తలలో నాలుకలా మెలిగిన కానిస్టేబుల్‌ ఇక లేడన్న సమాచారంతో పోలీసుశాఖలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిపినా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మంచితనం, సేవాగుణం గురించి చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -