Periods: పీరియడ్స్ సమయంలో అమ్మాయిలు అస్సలు చెయ్యకూడని తప్పులివే!

Periods: పీరియడ్స్ లేదా నెలసరి. ప్రతినెలా స్త్రీలకు పీరియడ్స్ రావడం అనేది సహజం. ఈ సమయంలో స్త్రీలు చాలా ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. కడుపునొప్పి సమస్యతో బాధపడడంతో పాటు ఇరిటేటింగ్ గా కనిపిస్తూ ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలకు నెలసరి రావడం మొదలవుతుంది. ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చేసరికి నెలసరి రావడం ఆగిపోతుంది. అయితే ఈ పీరియడ్స్ సమయంలో కొంతమంది మహిళలు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు నిపుణులు. స్త్రీలు ఎక్కువగా చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్త్రీలు పీరియడ్స్ సమయంలో మలబద్దకం, మోషన్స్, కడుపు ఉబ్బటం లేదా కడుపు నొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో చాలామంది స్త్రీలు ఆహారాన్ని తినడం మానేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో స్త్రీలు ఒక్క పూట ఆహారం తీసుకోకపోయినా కూడా ఇబ్బందే.. పీరియడ్స్ సమయంలో డైట్ బాగా పాటించాలి. సమయానికి మంచి ఆహారం తప్పకుండా తీసుకోవాలి. అలాగే పీరియడ్స్ లో రక్తం రంగుని గమనించాలి. రక్తం రంగులో మార్పులు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అటువంటి సమయంలో నిర్లక్ష్యం చేయకూడదు. కొందరు హైజిన్ సరిగా మెయింటేన్ చేయరు. పీరియడ్స్ లో ఉన్నా, నలుగురితో కలిసే ఉండాలి కాబట్టి హైజిన్ బాగా ముఖ్యం. ప్యాడ్స్ ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.

 

బయట తిరుగుతున్నప్పుడు వచ్చే ఇబ్బంది పక్కనపెడితే, ప్యాడ్స్ చాలాసేపు ఉంచుకోవడం వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పీరియడ్స్ లో ఎట్టి పరిస్థితులలోనూ రక్షణ లేని శృంగారంలో పాల్గొనకూడదు.పీరియడ్స్ సమయంలో సుఖవ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి తప్పులు చేయవద్దు. చాలామంది స్త్రీలు ఋతుక్రమం ఎప్పుడు మొదలయ్యింది, ఏ సమయంలో లాంటి విషయాలను గుర్తుంచుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పీరియడ్స్ సైకిల్ ఓ ట్రాక్ లో ఉంటేనే మీ ఆరోగ్యం ట్రాక్ లో ఉన్నట్లు. అలాగే పీరియడ్స్ సమయంలో విశ్రాంతి తీసుకోవడం కూడా తప్పే. విశ్రాంతి తీసుకోవాల్సిందే కాని శరీరం కదులుతూ ఉండాలి కూడా. లేదంటే క్రామ్ప్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అలాగే పీరియడ్స్ సమయంలో మహిళలు మద్యం ముట్టకపోతేనే మంచిది. పోరపాటున ఆ తప్పు చేసారో, క్రామ్ప్స్ మరింత ఎక్కువ అవుతాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -