Kodi Kathi Case: నా కొడుకు జైల్లో మగ్గుతున్నాడు.. కోడికత్తి కేసు నిందితుని తల్లి ఆవేదన అందుకేనా?

Kodi Kathi Case: విజయవాడలో వైఎస్ జగన్‌ పై గత ఎన్నికల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరిగిన తెలిసిందే. ఈ కోడి కత్తి కేసులో భాగంగా నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీనివాసరావు తల్లి విషయంపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ కేసును విశాఖ నుంచి ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా శ్రీనివాసరావు తల్లి సావిత్రి మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ..మా అబ్బాయి చాలా మంచివాడు.

ఎందుకు అలా జరిగిందంటే మేమేం చెప్పాలి..మేం జగన్‌ పార్టీ జగన్‌ అంటే మాకు మహాభిమానం. మేము ఆయననే నమ్ముకున్నాము. కానీ తప్పు మా మీదకు ఎందుకు తోశారో మాకేం తెలుసు? అని ఆమె తెలిపింది. అందరూ మీకు బుద్ధి లేదని అంటున్నా.. మేం ఆయన్నే నమ్మాము. నా కొడుకు బయటకు వస్తాడో రాడో దేవుడి చిత్తం. నా కొడుకు కర్మ అలా అయిపోయింది అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఎన్‌ఐఏ వాళ్లు నా కొడుకుది ఏమీ తప్పులేదని చెప్పారు. మా అబ్బాయి ఇంటికొచ్చేస్తాడనే నమ్ముతున్నా చివరిరోజుల్లో నా కొడుకు మా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు.

 

తాజాగా వచ్చిన గోదావరి వరదలకు ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో మిర్చి, బెండ తోటలు మునిగి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును విడుదల చేయాలని కోరుతూ గతంలో ఆమె రాష్ట్రపతికి లేఖరాశారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి తాడేపల్లి వెళ్లినా ఫలితం లేకపోయింది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -