YCP Cases: ఆ రెండు కేసుల వల్ల వైసీపీకి భారీ నష్టం మిగలనుందా?

YCP Cases: గత ఎన్నికల ముందు జరిగినటువంటి రెండు ఘటనలు జగన్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేశాయి అయితే ఇప్పుడు ఆ రెండు కేసులే జగన్ మెడకు ఉచ్చుల బిగుసుకున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ఆ రెండు కేసులు వల్ల జగన్ తీవ్ర విమర్శలు పాలవుతున్నారు.అయితే ఈ కేసుల విషయంలో అధికార పార్టీ ఎలా సమర్థించుకోవాలో తెలియక తప్పులపై తప్పులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఎన్నికల ముందు వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. అయితే ఆ సింపతితో జగన్ కి భారీగా ఓట్లు పడ్డాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక జగన్అధికారంలోకి రాగానే తన బాబాయ్ హత్య కేసును సిబిఐ విచారణకు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే ఈ కేసు గురించి దర్యాప్తు వేగవంతంగా చేస్తుంది.ఇక ఈ కేసులో నిందితులకు భావించినటువంటి సిబిఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వారిని కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది.

 

ఇలా ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరిన జగన్ ఇప్పుడు నిందితులని ఎందుకు రక్షిస్తున్నారని సందేహాలు ప్రజలలో తలెత్తాయి.అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈయనపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇలా అప్పటి అధికార పక్ష నేతలు వైయస్ జగన్ పై దాడికి ప్రయత్నించారంటూ పెద్ద ఎత్తున ఆరోపించారు. అలాగే ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేయాలని వైఎస్ఆర్సిపి కోరింది. అయితే దర్యాప్తు పూర్తి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు హాజరు కావాలని కోర్ట్ సూచించినప్పటికీ ఈయన మాత్రం హాజరు కావడం లేదు.

 

ఇలా తాము చెప్పిన రీతిలో ఈ కేసు దర్యాప్తు చేయడం లేదని తాను కోర్టుకు రావడానికి కుదరడం లేదంటూ జగన్ తరపు న్యాయవాదులు తెలియజేస్తున్నారు. ఇలా ఈ రెండు కేసుల వల్ల అప్పుడు సింపతి ద్వారా ఓట్లు సంపాదించుకున్న జగన్ కు ఇప్పుడు ఆ రెండు కేసులే వచ్చే ఎన్నికలలో తనకు డేంజర్ గా మారబోతున్నాయని, ఈ కేసులే తనని ప్రమాదంలోకి నెట్టి వేస్తున్నాయని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -