Nagarjuna: నిజ జీవితంలో నాగ్ పెద్దరికాన్ని నిలబెట్టుకోలేదా?

Nagarjuna: టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన నాగార్జునకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన.. వరుస సక్సెస్ లు అందుకుంటూ టాప్ రేంజ్ కు ఎదిగారు. ‘శివ’, ‘గీతాంజలి’, ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి చిత్రాలతో ఆయన అన్ని రకాలు ఆడియెన్స్ కు దగ్గరయ్యారు. ‘అన్నమయ్య’ సినిమాతో అశేష తెలుగు జనాల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

 

‘మన్మథుడు’, ‘మాస్’, ‘డాన్’, ‘శివమణి’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఇలా చెప్పుకుంటూ పోతే నాగ్ కెరీర్ ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఆయనకు ఏదీ కలసి రావడం లేదు. వరుస సినిమాలు ఫెయిలవుతుండగా.. ‘బిగ్ బాస్’ హోస్ట్ గానూ ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇదే టైమ్ లో తన ఇద్దరు కొడుకుల విషయంలోనూ నాగార్జున ఫెయిల్ అయ్యారనే కామెంట్లు వస్తున్నాయి.

 

అన్నింటా వైఫల్యమే..!
‘థ్యాంక్యూ’, ‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రాలు ఫ్లాప్ కావడంతో నాగ్ పెద్ద కుమారుడు నాగ చైతన్య నిరాశలో కూరుకుపోయారు. అదే సమయంలో సమంతతో ఆయన విడాకులు తీసుకోవడంతో వ్యక్తిగత జీవితంలోనూ సంతోషానికి దూరమయ్యారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ ఆయన డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు అఖిల్ కూడా వరుస సినిమాలు చేస్తున్నా హిట్లను అందుకోవడంలో విఫలమవుతున్నాడు.

 

ఇలా తన కెరీర్ తోపాటు పిల్లల కెరీర్లను సరిగ్గా మలచడంలోనూ నాగార్జున పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శలు వస్తున్నాయి. చైతన్య వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆయన సెటిల్ చేయలేకపోయారని.. సామ్ తో డివోర్స్ తీసుకోకుండా ఆపలేకపోయారని కామెంట్లు వస్తున్నాయి. ఇలా తన పెద్దరికాన్ని నిలబెట్టుకోవడంలో నాగ్ నిర్లక్ష్యమే ఈ సమస్యలన్నింటికీ కారణమని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, నాగ్ వీటిపై ఎలా స్పందిస్తారో చూడాలి. పిల్లలిద్దరి కెరీర్లను సెటిల్ చేస్తారేమో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -