Sri Sathya: శ్రీ సత్యకు నాగార్జున బిగ్ బాస్ లో ఛాన్స్ ఇప్పించారా.. ఆ సినిమా వల్లే అంటూ?

Sri Sathya: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. ఇక సీజన్ సిక్స్ కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్లలో శ్రీ సత్య ఒకరు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లినటువంటి ఈమె పలు సినిమాలలో నటించే సందడి చేశారు.ఇలా పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన శ్రీ సత్య ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారు.

ఇలా శ్రీ సత్య పలు సినిమాలలో నటించిన పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోయిన ఈమెకు బిగ్ బాస్ అవకాశం ఎలా వచ్చిందని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే నటి శ్రీ సత్యకు బిగ్ బాస్ అవకాశం రావడం వెనుక నాగార్జున హస్తం ఉందని తెలుస్తోంది. నాగార్జున వల్లే ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారట.

నటి శ్రీ సత్య నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీసత్య ఒక చిన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమా పరిచయం వల్లే నాగార్జున శ్రీసత్యకు ఛాన్స్ ఇప్పించారని ఇండస్ట్రీలో టాక్. ఇలా శ్రీ సత్యతో ఉన్న పరిచయం కారణంగానే ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారని ఇండస్ట్రీలో కోడైకూస్తుంది.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి నటి శ్రీ సత్య అర్జున్ మధ్య బిగ్ బాస్ లవ్ ట్రాక్ నడపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య అలాంటి సన్నివేశాలను చూపిస్తూ అభిమానులలో కూడా వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే సందేహాలను కలిగిస్తున్నారు.అయితే శ్రీ సత్య ఇదివరకే పవన్ రెడ్డి అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకొని చివరి క్షణంలో తనతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నారని అయితే ఆయన ప్రవర్తన కారణంగానే ఈమె ఈ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -