Ram Charan: ఆ భయంతో ఒకరోజు రాత్రి మొత్తం నాగార్జున ఇంట్లోనే దాక్కున్న చరణ్.. ఏం జరిగిందంటే?

Ram Charan:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక చిరంజీవి కొడుకు సినిమాలలోకి వస్తున్నారు అంటే ఆ సినిమాలపై ఎలాంటి అంచనాలు ఉంటాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిరుత సినిమా విడుదల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అంచనాలను పెట్టుకున్నారు. చిరంజీవి కొడుకు సినిమా అంటే చిరు స్థాయికి అనుగుణంగానే ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకుని ఉంటారు.

ఈ సినిమా రేపు విడుదల అవుతుంది అనగా చరణ్ మాత్రం చాలా టెన్షన్ పడ్డారట. ఇలా చిరుత సినిమా విడుదలకు ఒకరోజు ముందు రాంచరణ్ నాగార్జున ఇంటికి వెళ్లి సినిమా విడుదల గురించి చాలా కంగారు పడటంతో నాగార్జున ఆయనకు చాలా ధైర్యం చెప్పారట. ఈ సినిమా నేను ప్రీమియర్ షో చూశాను సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నువ్వేమీ కంగారు పడకు చాలా ధైర్యంగా ఉండు మంచి సక్సెస్ అందుకుంటారు అంటూ చాలా ధైర్యం చెప్పారట.

ఇలా నాగార్జున చరణ్ కు ఎంత ధైర్యం చెప్పినా చరణ్ మాత్రం సినిమా విషయంలో భయపడుతూనే ఉన్నారట. ఇక ఆరోజు రాత్రి మొత్తం రామ్ చరణ్ సినిమా విషయంలో భయపడుతూ నాగార్జున ఇంట్లోనే ఉన్నారని ఒక సందర్భంలో నాగార్జున తెలియజేశారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి రామ్ చరణ్ తన తండ్రి పేరును నిలబట్టగలనా లేదా అని భయపడినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో తండ్రికి మించిన తనయుడిగా పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

తన తండ్రి తెలుగు చిత్ర పరిశ్రమ వరకు మంచి సక్సెస్ అందుకోగా ఈయన మాత్రం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ చిరంజీవి పేరును ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారని చెప్పాలి.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -