Nagma: 48 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటానని చెబుతున్న నగ్మా.. ఆ అదృష్టవంతుడు ఎవరంటూ?

Nagma: నగ్మా తన సినిమా ప్రస్థానాన్ని హిందీ సినిమా భాగీ చిత్రంతో ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె సల్మాన్ ఖాన్ తో నటించింది. ఆ తర్వాత తెలుగులో కూడా చిరంజీవితో ఘరానా మొగుడు, సుమన్ తో పెద్దింటి అల్లుడు ఇలా టాప్ స్టార్ లందరితోని నటించి టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈమె తెలుగు, హిందీ లతో పాటు దాదాపు 7, 8 భాషల్లో నటించింది. భాష ఎప్పుడూ నటనకి అవరోధం కాదు భాష, సంస్కృతిని నేను ఇష్టపడతాను అని చెప్పుకుంటుంది నగ్మా.

హీరోయిన్ గా ఛాన్సులు తగ్గుతున్న సమయంలో అత్తగా, అమ్మగా కూడా నటించింది. ఆ తర్వాత నటనకు పుల్ స్టాప్ పెట్టి రాజకీయాలలోకి చేరింది నగ్మా. 48 సంవత్సరాల వయసున్నా నగ్మా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈమె చెల్లెలు నటి జ్యోతిక మాత్రం తమిళ స్టార్ హీరో సూర్య ని పెళ్లి చేసుకుని లైఫ్ లో హ్యాపీగా సెటిల్ అయిపోయింది. మరో చెల్లెలు రోషిని కూడా పెళ్లి చేసుకుంది. కానీ నగ్మా మాత్రం పెళ్లి చేసుకోలేదు. చాలామంది తో ప్రేమాయణాలు మాత్రం నడిపించింది.

 

కొన్ని రోజులు ప్రభుదేవాతో, కొన్ని రోజులు నటుడు శరత్ కుమార్ తో, కొన్ని రోజులు క్రికెటర్ సౌరవ్ గంగూలీతో ప్రేమాయణం నడిపించిందని నటుడు రవి కిషన్ తో పెళ్లి కూడా అయిపోయిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అయితే తనకి నగ్మా కి ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఈ మధ్యనే రవి కిషన్ స్పష్టం చేశాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నగ్మా.

 

నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉండేది. పిల్లల్ని కనాలని, ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేదని. భగవంతుని దయ వలన ఇప్పటికైనా ఆ కోరిక తీరుతుందేమో చూడాలని చెప్పుకొచ్చింది నగ్మా. అయితే ఇన్ని సంవత్సరాలు తర్వాత అమ్మడు పెళ్లి మీద మొగ్గు చూపిస్తే చేసుకునే ఆ అదృష్టవంతుడు ఎవరో అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -