Raghavendra Rao: ఆ హీరోయిన్ విషయంలో రాఘవేంద్రరావు అసభ్యంగా ప్రవర్తించాడా?

Raghavendra Rao: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు హీరోయిన్ లను పిండేయడం అన్నది కామన్. అది సినిమాల పరంగా లేదంటే ఇతర మరేదైనా పరంగా కావచ్చు. అలా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు కూడా హీరోయిన్ నగ్మాను ఒక రేంజ్‌లో వాడేసుకున్నారట. ఎంతలా అంటే నగ్మా ఇక నేను రాఘవేంద్రరావు డైరెక్షన్ లో సినిమాలు చేయను రా బాబోయ్ అనేంతలా ఆమెను పిండేసాడ‌ట‌. కాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో సినిమాలు అంటే ఎంతో కఠినంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆయన అనుకున్న ఎక్స్‌ప్రెష‌న్స్ రాకపోయినా ఆయన చెప్పిన విధంగా చేయకపోయినా కోప్పడతారు.

ఈ విషయం టాలీవుడ్‌లో అందరికి తెలిసిందే. కే రాఘవేంద్రరావు సినిమాలో నటించాలని చాలామంది హీరోయిన్లు ఎంతో ఆశపడుతారు. ఎందుకంటే ఏ డైరెక్టర్ చూపించని విధంగా రాఘవేంద్రరావు తన సినిమాలో హీరోయిన్తని ఎంతో స్పెషల్ గా చూపిస్తార‌న్న‌ది అందరికీ తెలిసిందే.
రకరకాల పండ్లను, పూలను హీరోయిన్ల‌ బాడీ పార్ట్స్ పై వేసి స్పెషల్ అట్రాక్షన్ క్రియేట్ చేస్తారు. ఇప్పటివరకు రాఘవేంద్రరావు తన కెరీర్ లో 110 సినిమాల‌కు పైగా తెరకెక్కించారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతోమంది హీరోయిన్లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన డైరెక్షన్లో ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం అతిలోకసుందరి శ్రీదేవినే అన్న సంగతి కూడా మనందరికి తెలిసిందే.

 

కాగా వీరి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇదే క్రమంలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమాలలో శ్రీదేవి తర్వాత బాగా దగ్గరైన హీరోయిన్ ఎవరు ? అంటే నగ్మా అని చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రాఘవేందర్రావు డైరెక్షన్లో చిరంజీవి హీరోగా వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో నగ్మా హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ సమయంలో పాపం నగ్మాని రాఘవేందర్రావు చాలా ఇబ్బంది పెట్టేసాడట.
మరి ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు అనే సాంగ్ షూటింగ్ సమయంలో నగ్మని ఒక రేంజ్ లో ఆడుకున్నాడట రాఘవేంద్రరావు. ఈ పాటలో చీరపైకి ఎత్తి మాస్ స్టెప్పులు వేయడం నగ్మాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదట. అయినా కానీ రాఘవేంద్ర‌రావు దగ్గరుండి మ‌రీ ఆమెతో మాస్ స్టెప్స్ వేయించారట. అంతేకాకుండా తాగుతూ తూలుతూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమంటూ నిజంగానే మందు తాగమని సజెస్ట్ చేశారట. అంతేకాకుండా ఈ సినిమా కోసం చిరంజీవితో డైరెక్టుగా లిప్ కిస్ పెట్టించార‌ట‌. రాఘవేందర్రావు మిగతా ఏ హీరోయిన్ ని ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదట .కేవలం నగ్మాను మాత్రమే ఈ సినిమా కోసం అంతలా టార్చర్ చేసారట.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -