Nagma: ఆ హీరోకు నగ్మాకు మధ్య అలాంటి సంబంధం ఉందా?

Nagma: సాధారణంగా ఒక భాషలోని నటీనటులు మరో భాషలో నటించడం అన్నది సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ ఆ విధంగా నటించిన విషయం తెలిసిందే. అలా కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ తెలుగులో పలు సినిమాలలో నటించారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ ప్రముఖ భోజ్‌పురి స్టార్ రవి కిషన్ సైతం రేసుగుర్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రేసుగుర్రం సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్ ఆ తరువాత కూడా పలు సినిమాల్లో విలన్‌గా నటించారు.

అలాగే యూపీలో ఎంపీగా కూడా ఉన్నారు. ఆయనకి అక్కడ రాజకీయ నాయకుడిగా మంచి పేరు కూడా ఉంది. అయితే ఈ నటుడికి ఒకప్పటి తమిళ, తెలుగు స్టార్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు నగ్మాతో వివాహేతర సంబంధం ఉందంటూ అప్పట్లో జోరుగా ప్రచారాలు కొనసాగాయి. ఆ ప్రచారం పై తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ స్పందించారు. ఈ సందర్భంగా రవి కిషన్ మాట్లాడుతూ.. నేను నగ్మా కలిసి చాలా చిత్రాలలో నటించాము. అవి బ్లాక్‌ బస్టర్‌లు అయ్యాయి. అందుకే అలాంటి పుకార్లు వ్యాపించాయి.

 

అయితే మేం చాలా మంచి స్నేహితులం. కాబట్టి మేము ఎక్కువగా సినిమాలు కలిసి చేసేవాళ్లం. అంతేకాని మరేం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా నాకు పెళ్లి అయిందని ఆమెతో పాటు అందరికీ తెలుసు. నేను నా భార్య ప్రీతి శుక్లాను గౌరవించడంతో పాటు ఆమెకు భయపడుతాను. ఆమె పాదాలు తాకడానికి కూడా వెనుకాడను. ఎందుకంటే నా దగ్గర డబ్బు లేనప్పటి నుంచే నా భార్య నాతోనే ఉంది అని చెబుతూ ఆ వివాహేతర సంబంధాల రూమర్స్ కి చెక్ పెట్టేసాడు రవి కిషన్. ఒకానొక ఇంటర్వ్యూ లో నగ్మా కూడా ఈ రూమర్స్ పై స్పందిస్తూ.. ఎవరైనా తన సహా నటులతో మంచి బంధాన్ని కలిగి ఉంటే ఏమౌతుంది. రీల్ లైఫ్‌లో, మేము భర్త, భార్య లేదా ప్రేమికులను నటిస్తాము. కెమెరా లేనప్పుడు కూడా ఒకరితో మరొకరికి మంచి రిలేషన్ ఉండడంలో తప్పేముంది అని తెలిపింది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -