Tulsi Plant: తులసి మొక్క విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం పడుతుందా.. అల మాత్రం అస్సలు చేయొద్దంటూ?

Tulsi Plant: తులసి మొక్క ప్రతి హిందువు ఇంట్లోనూ తప్పకుండా ఉంటుంది. తులసి మొక్క కి ఉన్న ప్రాధాన్యత అటువంటిది.తులసికి లక్ష్మీదేవి హోదా ఇవ్వబడింది. పాత రోజుల్లో అయితే ఈ మొక్కలు పెరట్లో ఉండేవి. సంప్రదాయబద్ధంగా దానికోసం కోట తో సహా అన్నీ సౌకర్యాలు సిద్ధం చేసుకునేవారు. అయితే నేటి అపార్ట్మెంట్ల యుగంలో తులసి మొక్క పెట్టుకోవడమే గగనం అయిపోతున్న రోజులు వచ్చేసాయి. అలానే తులసి చెట్టు ఇంట్లో ఉండాలని చెప్పి ఎక్కడపడితే అక్కడ తులసి చెట్టుని నాటకూడదు.

అసలు ఈ తులసి మొక్క విషయంలో మనం చేయకూడని తప్పులు ఏమిటో చూద్దాం. మీ ఇంట్లో తులసి మొక్క లేనప్పుడు కొత్తగా తులసి మొక్క నాటాలనుకుంటే కార్తీకమాసం ఉత్తమమైన సమయం. కార్తీక మాసం తులసి మొక్కని ఇంట్లోకి తెచ్చినాటితే లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందని నమ్మకం. వాస్తు ప్రకారం తులసి మొక్క ఎప్పుడూ ఇంటికి ఉత్తర లేదా ఈశాన్య దిశలో నాటాలి. ఈ దిశలో దేవతలు నివసిస్తారని చెప్తారు.

తులసి మొక్కని ఇంటి ముఖద్వారం వద్ద చెత్తను ఉంచే ప్రదేశంలో లేదా బూట్లు తీసే ప్రదేశంలో ఎప్పుడూ నాటకూడదు. తులసి మొక్కని ఎప్పుడూ మట్టి కుండలో ఉంచేందుకు ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ కంటైనర్ లోని తులసి మొక్కను పెంచే ప్రయత్నం చేయకండి. తులసి మొక్కని ఇంటి దక్షిణ దిశలో నాటకూడదు. ఇది పూర్వీకులది. అక్కడ తులసి మొక్కని నాటితే ఆర్థిక నష్టం కలుగుతుంది. తులసి మొక్కని బాల్కనీ లేదా కిటికీలో నాటుకోవచ్చు.

కానీ వాస్తు శాస్త్రంలో ఇచ్చిన దిశను గమనించి అప్పుడు నాటుకోవచ్చు. ఏకాదశి రోజు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజుల్లో అలాగే సంధ్యవేళ దాటిన తరువాత తులసిని తాకకూడదు. తులసి మొక్కని వంటగది లేదా బాత్రూం దగ్గర ఉంచకూడదు. తులసి మొక్కకు పూజగది కిటికీ దగ్గర ఉంచవచ్చు. తులసికి నీటిని సమర్పించేటప్పుడు మహా ప్రసాద జననీ, సర్వ సౌభాగ్య వర్దిని, ఆదిమాద్ హర నిత్యం, తులసిత్వం నమోస్తుతే అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే అసౌచంలో ఉన్నప్పుడు తులసి మొక్కని ముట్టుకునే ప్రయత్నం చేయకండి. ఇది మహా పాపం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -