Holy Basil: ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Holy Basil: భారతదేశంలోని హిందువులు తులసి మొక్కను దేవతగా భావించి తరచుగా పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కాలం నుంచి తులసి మొక్కను ఆయుర్వేదంలో వినియోగిస్తున్న విషయం తెలిసిందే. తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు కొలువై ఉంటారు. దాంతో తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీ విష్ణువు అలాగే తులసి దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. క్రమం తప్పకుండా తులసి మొక్కను పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు మెరుగవ్వడంతో పాటు సంతోషం శ్రేయస్సు లభిస్తుంది.

కాగా తులసి మొక్క వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తులసి మొక్కను దైవంగా పూజించడంతో పాటుగా ఆరోగ్య సంజీవనిగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే తరచుగా తులసి ఆకులను తింటూ ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
తులసిలో అనేక సుగుణాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే ఉదయం మొహం కడిగాక ఖాళీ కడుపుతో రెండు లేదా మూడు తులసి ఆకులను నమిలి తింటే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

 

ఈ రోజుల్లో కొందరు మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు. వారికి తులసి ఆకులు ఔషధంలా పనిచేస్తాయి. ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగేలా తులసి సహాయపడుతుంది. ఇక ఎవరైనా ఒత్తిడితో బాధపడుతుంటే తులసి ఆకులు మీకు త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. ఖాళీ కడుపుతో తినడం వలన ఒత్తిడి దూరం అవుతుంది. ఖాళీ కడుపుతో తులసిని తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది.తరచూ తినడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -