Devotional: కష్టాలు పోయి.. అదృష్టం పట్టిపీడించాలంటే ఈ విధంగా చేయాల్సిందే?

Devotional: డబ్బు.. ఈ రెండు అక్షరాల పదం మనిషిని ఎంతటి దారుణానికైనా తెగించేలా చేస్తుంది. అంతే కాకుండా ప్రస్తుత సమాజంలో డబ్బు ఉంటేనే మనుషులకు గౌరవం ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఏ పని జరగాలి అన్నా కూడా అన్ని పనులు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. డబ్బు కారణంగా చాలా బంధాలు కూడా దూరం అవుతున్నాయి. డబ్బు లేకపోతే సమాజంలో విలువ కూడా ఇవ్వడం లేదు. దాంతో ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని నిరంతరం రాత్రి పగలు కష్టపడుతూనే ఉన్నారు. కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ కొందరికి డబ్బు చేతిలో మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు.

ఇంకొందరు మాత్రం వాస్తు ప్రకారంగా నియమాలను పాటించినప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. కొందరు లక్ష్మీదేవికి అలాగే దేవుళ్లకు భక్తిశ్రద్ధలతో పూజిస్తూ గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా కష్టాలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలు పోయి అదృష్టం పట్టాలి అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించడం తప్పనిసరి. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదివారం రోజు తమలపాకు చెట్టును పూజించాలి. ఆ చెట్టు దగ్గర కొంత డబ్బు పెట్టి అలా వదిలేస్తే అదృష్టం వరిస్తుంది.

 

మీ కష్టాలు కూడా తీరుతాయి. అలాగే మీరు ప్రతి రోజు తులసి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీకు పాజిటివ్ ఎనర్జీ పెరిగి దురదృష్టం తొలగి పోతుంది. అలాగే లక్ష్మి దేవి కూడా మీ దగ్గరే ఉంటుంది. తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీ విష్ణు దేవి అలాగే తులసి మొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మీరు సరైన దిశలో ఆహారం తీసుకుంటే మీ ఇంట్లో సంతోషం రెట్టింపు అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భోజనం చేసే టప్పుడు తూర్పు ముఖంగా కూర్చుని ఆహారాన్ని తినాలి. ఇంకా మీరు పూజకు ఉపయోగించే పువ్వులు దేవుడి నుండి తీసిన తర్వాత పారే నీటిలో లేదా భూమిలో పాతిపెట్టడం మంచిది. మీరు రోజు స్నానం చేసిన తర్వాత ఈశాన్య మూలలో గంగాజలం చల్లితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ విధమైన చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోవడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -