Lakshmi Devi: లక్ష్మీ కటాక్షం ఉండాలంటే పాటించాల్సిన సూత్రాలివే.. వందల కోట్లు వస్తాయంటూ?

Lakshmi Devi: జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బును సంపాదించి జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటాము అయితే మనం ఎంతో కష్టపడి పని చేస్తున్న చేతిలో డబ్బు నిలవదు ఇలా చేతిలో డబ్బు నిలబడకపోవడం వల్ల మనం కొన్ని వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. ఇలాంటి వాస్తు పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని తద్వారా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని భావిస్తారు.

ఇక లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉండాలి అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం విషయంలో ఈ నియమాలు పాటించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మన పైనే ఉంటాయి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ప్రధాన ద్వారం ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. ప్రధాన ద్వారం ఎదురుగా చెప్పులు చెత్తాచెదారం వంటి వాటిని అసలు ఉంచకూడదు అందమైన పువ్వులతో అలంకరించుకోవాలి అలాగే ప్రధాన ద్వారం వద్ద ఏనుగు విగ్రహాలు ఉండటం శుభసంకేతం.

ఇక ఇంట్లో కూడా పనికిరాని వస్తువులు విరిగిపోయిన బొమ్మలు వస్తువులను అసలు పెట్టుకోకూడదు. ఇలాంటివి పెట్టుకుంటే లక్ష్మీదేవి ఆ ఇంట అడుగుపెట్టదు ఇలాంటి వాటిని తీసేసి ఇంటిని చాలా సుందరంగా అలంకరించుకున్న వారి ఇంటిలోకే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇకపోతే రంగు రంగు రాళ్లతో వివిధ రకాల బొమ్మలను అలంకరించుకోవడం వల్ల లక్ష్మీదేవి వెంటనే ఆకర్షితులవుతారు.

ఇక ఇంటి ప్రధాన ద్వారం లోపల వైపు నీటిని ఒక గిన్నెలో అందంగా అలంకరించి పెట్టుకోవడం ఉత్తమం లేదంటే వాటర్ ఫ్లో ఉండేలాగా ఏదైనా బొమ్మలను కొనుగోలు చేసి అలంకరించుకోవడం మంచిది ఇలా మన ఇంట్లో జలపాతం ఉంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన ఇంటిపై అదే విధంగానే ఉంటుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తే కనుక తప్పనిసరిగా అమ్మవారి కరుణ కటాక్షాలు మనపైనే ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -